శ్రీ ధర్మశాస్తా శిరసానమామి (శ్రీరామదూతం శిరసానమామి వరుసలో)

0

మాల పవిత్రత వర్ణన, 150కి పైగా నామాల స్తోత్రం, 18 మెట్ల వర్ణన . ప్రతి పంక్తికీ “శ్రీ ధర్మశాస్తా శిరసానమామి” అనే పల్లవితో తెలుగు భజన.

శ్రీ స్వామియే శరణం అయ్యప్ప ॥ అస్మత్ శ్రీ గురుభ్యో నమః ॥

మాల పవిత్రత / వర్ణన – మాల వర్ణన

  • ముత్యాల కాంతితో — మెరిసేటి మాలా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • రతనాల కాంతితో — వెలిగేటి మాలా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • అళుదానదియందు — మునిగేటి మాలా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • సాయుజ్య పదవిని — యోసగేటి మాలా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • కర్పూర జ్యోతితో — కలిసేటి మాలా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • కనక మణి కంఠుని — తులసి మణిమాలా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • ఆర్తితో శరణాలు — పలికించు మాలా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • అయ్యప్పస్వామి యొక్క — అరవింద మాలా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • జాతిమత భేదములు — తొలగించు మాలా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • జగదేకవీరునితో — జతకలుపు మాలా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • పంబానదియందు — మునిగేటి మాలా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • పరితపించే వారు — కోరేటి మాలా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • రుద్రయ్య తనయుని — రుద్రాక్ష మాలా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • శ్రీ హరి తనయుని — శ్రీ గంధ మాలా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • శరవణ సోదరుని — స్ఫటిక మణిమాలా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • కన్నెస్వాముల కంఠ — మలరించు మాలా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • ఆనందరూపుని — ఆశ్రితుల మాలా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • పంచగిరివాసుని — పగడమణి మాలా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • పందళ బాలుని — పావన మాలా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • గణపతి సోదరుని — సుగంధమాలా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • కామక్రోధాదులను — తొలగించు మాలా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • కాంతగిరి నాధుని — కైవల్య మాలా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • కాఠిన్య హృదయాన్ని — కరిగించు మాలా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • కామాక్షి తనయుని — తులసిమణి మాలా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి

స్తోత్రమ్ – నామ స్తోత్రం

  • శంకర తనయా — శబరిగిరి నిలయా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • మోహినీ తనయా — మోహన రూపా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • పంబాబాలా — పతిత పావనా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • పందళరాజ తనయా — పరమాత్మ రూపా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • భక్త జన రక్షక — శ్రీ భూతనాథా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • సద్గురునాథా — సుందర రూపా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • సంకట నాశకా — సచ్చిదానంద స్వరూపా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • శత్రు సంహారా — శాంత స్వరూపా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • ఆపద్బాంధవా — అనాథ రక్షక — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • అభయ స్వరూపా — అమితగుణాకర — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • ఆశ్రిత వత్సల — ఆనందమూర్తీ — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • అన్నదాన ప్రభువా — అభయ స్వరూప — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • చిన్ముద్రరూపా — చిరుమందహాస — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • మహిషి మర్దన దేవ — మన్మథస్వరూప — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • పదునాల్గు లోకములు — పాలించే స్వామి — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • కానన వాసా — కాంతగిరి దేవా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • అరణ్య వాసా — అయ్యప్ప దేవా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • నామనంబులో నిన్నే — నమ్మి కొలిచేము — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • ముదమార నీముద్ర — మాల దాల్చేము — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • కన్నెస్వామి ప్రియ — కరిమలా నిలయా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • నియమ పాలక ప్రియా — నీలాంబరాయ — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • కార్తీకమాస ప్రియా — కరుణించవయ్యా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • నెయ్యాభిషేక ప్రియా — నీలాంబరాయ — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • గురుస్వామి రూపాయ — గుణగోచరాయ — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • భవబంధనాశాయ — బ్రహ్మానుజాయ — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • గంధాభిషేక ప్రియ — గణపతి సహోదరా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • శరణఘోష ప్రియ — శరవణసోదరా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • శివకేశవాత్మజా — సిద్ధి ప్రదాయకా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • మోహినీ నందనా — మోహాది విభంజనా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • పందళేశుని పుత్ర — వావరుని మిత్ర — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • కేరళ స్థిరవాస — కృష్ణాంబరాయ — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • భూతనాథా — సర్వభూతాదివాస — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • సత్యస్వరూపాయ — సద్బ్రహ్మచారీ — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • అన్నదాతా దేవ — అభయ ప్రదాయ — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • కలిదోష హారకా — కరిమలావాసా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • శక్తి స్వరూపాయ — శబరిమల నిలయా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • హరి హర నందన — ఆనంద వర్ధనా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • శబరి నిరోధాయ — శబరి మోక్షాయ — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • వన్‌పులి వాహనా — విల్లాలి వీరా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • శ్రీ పూర్ణ పుష్కల — సిరినొసలి తిలకమా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • కన్నెస్వామి ప్రియ — కాంతిమలవాసా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • విల్లాలివీరా — వీరమణి కంఠా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • పట్టబంధాసనా — పరమాత్మరూప — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • అతిలోక సుందరా — అమితగుణాకర — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • గురువులకు గురువైన — శ్రీ గోప్తృశాస్తా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • పాలాభిషేకప్రియ — పందళ నరేశా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • ఇంద్రాది సురకోటి — వందితాచరణా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • గురుపుత్రునకు కనులు — పలుకు లిచ్చేస్వామి — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • సర్వహృదయావాస — శార్దూల గంధర్వ — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • హరిహరాసనా — భూరిగజవాహనా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • గరుడ వాహన పుత్ర — గాంధర్వలోల — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • జ్ఞాన స్వరూపాయ — జ్ఞానదాతాయ — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • మకరజ్యోతి స్వరూప — మా అయ్యప్ప స్వామి — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • నాగరాజారూప — నర్తన ప్రియాయ — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • ఆర్త రక్షక స్వామి — ఆపన్నివారా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • భస్మాభిషేక ప్రియ — భాగవతోత్తమ — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • సురమకుట మణిగణ — రంజితాచరణా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • లావణ్య రూపాయ — లక్ష్మీ కుమారాయ — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • షణ్ముఖునిసోదరా — షడ్వర్గవారయ — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • పంపాతటీ వాస — పాపనాకృతియే — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • ప్రాణ స్వరూపా — పార్వతీపుత్రా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • యోగసంయోగాయ — యోగి గమ్యాయ — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • వేద వేదాంతాయ — విష్ణుసంభూతా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • శతకోటి మన్మథ — సౌందర్యమూర్తీ — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • సిరిసంపదలనిచ్చు — చిన్నారి స్వామి — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • పద్దెనిమిది మెట్లపైనున్న — పరమాత్మ రూపా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • తారక ప్రభువే — భవతార కాయ — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • ఆశ్రితాఖిలదాయ — అమితగుణదాయ — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • ఇరుముడి ప్రియ — ఈశిత్వదాయ — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • మన్మథస్వరూపా — మహిషి సంహార — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • పరబ్రహ్మ రూపాయ — పరమాత్మకాయ — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • అళుదానదీ కృతే — ఎరిమేలి శాస్తా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • లోక శాస్తాదేవ — ధర్మశాస్తావే — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • కోటి భాస్కరతేజ — కోమలస్వరూప — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • దండిగామాకీయు — అండదండలనూ — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • కోదండ పాణి — మా కోరికలు తీర్చు — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • హంస స్వరూపాయ — పరమ హంసాయ — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • శుద్ధ చైతన్యాయ — శ్రుతి వందితాయ — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • వైరాగ్య కారకం — వైభోగదాయకం — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • కంజదళ నేత్రం — కమనీయగాత్రం — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • బాల స్వరూపాయ — బ్రహ్మాండతేజ — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • మహిషి మర్దనదేవ — మోక్షప్రదాత — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • కామితార్థప్రదా — కళ్యాణమూర్తీ — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • దివ్య స్వరూపా — దేవాదిదేవా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • పాప సంతాపా — పావననామా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • శరణ మంటేచాలు — కరుణించు తండ్రీ — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • కణ్ణగీ రక్షకా — కాపాడవయ్యా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • పింజళ ప్రియదేవా — ప్రీతి వర్ధాయ — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • భవబంధనాశాయ — భావనాతీతా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • సర్వరోగములనూ — సమయించు స్వామీ — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • ఏడేడులోకముల — ఏకైకనేతా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • మాదరిద్రము బాపి — మమ్ము కాపాడు — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • మా పాపములనెల్ల — మన్నించు ప్రోచు — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • కర్మములు తప్పించి — కాపాడుమయ్యా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • మా కోరికలు దీర్చు — మమ్ము రక్షించు — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • మా మనోబుద్ధులను — మంచి గావుంచు — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • అసమానతేజా — అమితగుణాకర — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • దైవరాజాయ — దయగల ప్రభువా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • దుష్ట శిక్షక సర్వ — శిష్ట సంరక్షకా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • జగదేకవీరాయ — జలజనేత్రాయ — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • కామక్రోధలోభ — మోహమదనాశ — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • మాత్సర్యనాశాయ — మణికంధరాయ — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • అతిదయాళోస్వామి — అమరవంద్యాయ — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • తల్లిదండ్రియు గురువు — దైవమ్ము నీవే — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • సుజ్ఞానరూపాయ — సురసేవితాయ — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • వైరాగ్య జితశుకా — వైభవకుబేరా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • శ్రుతి శిఖర సంచార — శ్రిత రక్షకాయ — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • అపురూప సుందరా — ఆదిత్య తేజా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • కవిజనాశ్రయ పాద — కళ్యాణభూజా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • కష్టము లెల్లను బాపి — కరుణించుస్వామీ — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • కలిదోషనాశాయ — కైవల్యదాయా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • పరమేశ శబరీశ — పరమ దయాళో — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి

చివరి పంక్తిని మూడు పర్యాయాలు పాడాలి.

18 మెట్ల వర్ణన – పదునెనిమిది మెట్లు

  • ఒకటవ మెట్టె — ఓంకారమూర్తీ — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • రెండవమెట్టె — హరిహర తనయా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • మూడవమెట్టె — మోహిని తనయా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • నాల్గవమెట్టె — నారాయణ తనయా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • ఐదవమెట్టె — ఐయ్యప్ప దేవ — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • ఆరవమెట్టె — ఆర్ముగసోదరా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • ఏడవమెట్టె — ఏకాంతవాసా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • ఎనిమిదవమెట్టె — ఎరుమేలివాసా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • తొమ్మిదవమెట్టె — నవగ్రహనాయకా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • పదవమెట్టె — పరమదయాళ — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • పదకొండవ మెట్టె — పరమాత్మరూప — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • పన్నెండవమెట్టె — పాపసంహార — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • పదమూడవమెట్టె — పరమ పావనా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • పదునాల్గవమెట్టె — పరసుఖదాయకా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • పదునైదవమెట్టె — పరశురామ ప్రతిష్ఠిత — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • పదహారవమెట్టె — పతితపావనా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • పదిహేడవమెట్టె — పార్వతినందనా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
  • పద్దెనిమిదవమెట్టె — పంచగిరీశ్వరా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి

సర్వం శ్రీ హరిహరసుతార్పణమస్తు — స్వామియే శరణం అయ్యప్ప ॥

ఇది తెలుగు/మలయాళ పదాలతో పాడే భజన; ఇతర భాషల వారు తమ లిపిలో చదివి అదే రాగంలో పాడవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here