పూజా సమాప్తి – క్షమాపణ, ఉద్వాసనం, తీర్థం, ప్రసాదం, శాంతి మంత్రాలు

5

ఉత్తరాంగ పూజ, పడిపూజ తరువాత పూజను సమాప్తి చేసే క్రమం: దిష్టికాయ, పంచ నమస్కారాలు, క్షమాపణ మంత్రం, రాజోపచారాలు, క్షీరార్ఘ్యం, అపరాధ నమస్కారాలు, హరివరాసనం, ఉద్వాసనం, క్షమా ప్రార్థన, తీర్థ స్వీకారం, ఈశ్వరార్పణం, ప్రసాదం, ఆశీర్వచనం, శాంతి మంత్రాలు.

దిష్టికాయ కార్యక్రమమ్ – దిష్టి తీయుట

గురుస్వామి గారు అయ్యప్పస్వామి పూజ చేసిన తరువాత (రాత్రి సమయంలో) కొబ్బరికాయపై కర్పూరం వెలిగించి పూజాస్థలం చుట్టూ చూపుతూ ఈ మంత్రం ఉచ్చరించాలి. తరువాత స్వామికి వీపు చూపకుండా వెనకకు నడిచి వాకిలి వరకు వెళ్ళి, వాకిలి ముంగిట కొబ్బరికాయ (దిష్టికాయ) కొట్టి, కాళ్ళు, చేతులు, కళ్ళు, ముఖం కడుగుకొని పూజ వద్దకు వచ్చి సాష్టాంగ దండ ప్రణామం ఆచరించాలి.

త్వగస్థిగతైః సర్వపాపైః ప్రముచ్యతే సర్వభూతేష్వపరాజితో భవతి ।
తతో భూత ప్రేత పిశాచ బద్ధ బ్రహ్మరాక్షస యక్షయమదూత శాకినీ ఢాకినీ సర్పశ్వాపద తస్కర
జ్వరాద్యుపద్రవ జోపఘాతాస్సర్వే జ్వలంతం పశ్యంతు । మాం రక్షంతు । యజమానగ్ం రక్షంతు । సర్వేజనాన్ రక్షంతు ॥

పంచ నమస్కారాః – శ్రీ ఆదిశంకర ప్రణీత పంచరత్న స్తోత్రం

ఐదు శ్లోకాలకు ఐదు పర్యాయాలు సాష్టాంగ నమస్కారాలు చేయాలి – పూర్తి స్తోత్రం:    శ్రీ అయ్యప్ప పంచరత్నం.

క్షమాపణ మంత్రమ్ – క్షమాపణ ప్రార్థన

శ్రీ ధర్మశాస్తా! కరుణా సముద్రా! భక్తవత్సలా! లోకపూజితా! ఓ తేజోమయమూర్తీ! మీకు నా నమః సుమాంజలులు.

హరిహరపుత్రా! అయ్యప్పస్వామీ! సచ్చిదానందమూర్తీ! సర్వేశ్వరా! శబరిగిరీశ్వరా! సత్యమగు అష్టాదశ సోపానాలపై కాంతమల శిఖరాగ్రమున స్వర్ణమందిరమున రత్నసింహాసనమున “పట్టబంధాసన” సీనులై, కుడిచేతితో “తత్త్వమసి” చిహ్నమైన “చిన్ముద్ర” ధరించి, ఎడమచేతి భంగిమ భక్తులకు తనపాదములే శరణ్యమని పాదములు చూపుచున్న “ఆనందముద్ర” ధరించి అమరియుండి ఈ అఖిలాండాన్ని పాలించి కాపాడు ఓ తారక బ్రహ్మస్వరూపా! నేను చేసిన పూజలయందు గాని, నాలో గల భక్తియందు గాని ఏ దోషమున్నను కరుణతో కాపాడి రక్షించు స్వామీ! ఓ జ్ఞానస్వరూపా! జ్ఞాన, అజ్ఞాన విచక్షణ లేక మనసా, వాచా, కర్మణా తెలిసీ తెలియక మేము చేయు సకల తప్పులను దయతో మన్నించి కాపాడు, అభయస్వరూపా! అయ్యప్పస్వామీ!

పాహిమాం! పాహిమాం! పాహిమాం! పాహి! పాహి!
జ్యోతిస్వరూపా! మణికంఠ స్వామీ!
రక్షమాం! రక్షమాం! రక్షమాం! రక్ష! రక్ష!
ఓం శాంతిః శాంతిః శాంతిః । హరిః ఓం తత్సత్ ॥

క్షమాపణ మంత్రం ఉచ్చరించిన తరువాత పుష్పాక్షతలు స్వామివారికి సమర్పించి నమస్కరించాలి.

రాజోపచారాః (ఛత్రాది సమర్పణ) – రాజ మర్యాదలు

వింజామరంతో గాని పుష్పంతో గాని స్వామివారికి వీస్తూ, ఈ ఉపచారాలు చేస్తున్నట్లుగా మనసులో భావించాలి.

ఛత్ర చామర గీత నృత్య ఆందోళికా అశ్వారోహణ గజారోహణ
సమస్త రాజోపచార దేవోపచార శక్త్యుపచార భక్త్యుపచారాన్ మనసా సమర్పయామి ॥ స్వామియే శరణం అయ్యప్ప ॥

ఉపచారం భావన
ఓం ఛత్రం ధారయామి గొడుగు పట్టుకుంటూ
ఓం చామరం వీజయామి వింజామరంతో వీస్తూ
ఓం గీతం శ్రావయామి సంగీతం పాడుతూ
ఓం నృత్యం దర్శయామి నాట్యం చేస్తూ
ఓం ఆందోళికాన్ ఆరోహయామి ఉయ్యాల ఎక్కించి ఊపుతూ
ఓం అశ్వానారోహయామి గుర్రంపై ఎక్కిస్తూ
ఓం గజానారోహయామి ఏనుగుపై ఎక్కిస్తూ
ఓం రథాన్ ఆరోహయామి రథంపై ఊరేగిస్తూ
ఓం వ్యజనం వీజయామి విసనకర్రతో విసురుతూ
ఓం వాద్యం ఘోషయామి మంగళ వాద్యాలు వాయిస్తూ

శ్రీ పూర్ణా పుష్కలాంబా సమేత శ్రీ హరిహరపుత్ర అయ్యప్పస్వామినే నమః ।
సమస్త రాజోపచార దేవోపచార శక్త్యుపచార భక్త్యుపచార మనసా సమర్పయామి ॥ స్వామియే శరణం అయ్యప్ప ॥

క్షీరార్ఘ్యమ్ – పాలు సమర్పణ

పాలను స్వామివారిపై పుష్పంతో జల్లుతూ

అనేన క్షీరార్ఘ్యప్రదానేన భగవాన్ సర్వాత్మకః శ్రీ హరిహరపుత్రః ప్రీయతామ్ ॥
ఓం నమో భగవతే … ధర్మశాస్త్రే స్వాహా । సపరివారాయ … నమః ।
క్షీరార్ఘ్యం సమర్పయామి ॥ స్వామియే శరణం అయ్యప్ప ॥
ఆచమనీయం సమర్పయామి ॥ స్వామియే శరణం అయ్యప్ప ॥

అపరాధ నమస్కారాః – క్షమ కోరుతూ నమస్కారాలు

భూతనాథ దయాసింధో దేహి మే వరమీప్సితమ్ ।
త్వయి భక్తిం పరాం దేహి పుత్రపౌత్రాంశ్చ సంపదః ॥

ఆవాహనం న జానామి న జానామి విసర్జనమ్ ।
పూజావిధిం న జానామి క్షమస్వ కరుణానిధే ॥

భూతనాథ జగన్నాథ దయాళో దేహి మే ప్రభో ।
ఆయుర్విత్తం చ సత్కీర్తిం భక్తిం త్వయ్యచలాం శ్రియమ్ ॥

అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ ।
తస్మాత్కారుణ్యభావేన రక్ష రక్ష మహాప్రభో ॥

అపరాధసహస్రాణి క్రియంతేఽహర్నిశం మయా ।
క్షమస్వ కరుణారాశే పితా పుత్రమివేశ్వర ॥ స్వామియే శరణం అయ్యప్ప ॥

పుష్పములు దేవునిపై వేయవలెను

అష్టస్తుతిః / శయన హారతి – హరివరాసనం

“హరివరాసనం” రాత్రి సమయంలోనే చదవాలి . స్వామిని నిద్రపుచ్చే శయన గీతం. పూర్తి పాఠం, అర్థం: హరివరాసనం.

ఉద్వాసనమ్ (యథాస్థానమ్) – యథాస్థానానికి పంపుట

పూజ ప్రారంభంలో భగవంతుని ఆవాహనం చేసి, పూజ ముగిసిన తరువాత యథాస్థానానికి పంపడమే ఉద్వాసనం. పుష్పాక్షతలు గణపతి, దేవి, సుబ్రహ్మణ్యస్వామి, అయ్యప్పస్వామివారిపై వేస్తూ – చిత్రపటాలను, విగ్రహాలను, దీపపు కుందులను, ఇతర పూజాసామగ్రిని ఉత్తర దిశగా లేక తూర్పు దిశగా కొద్దిగా కదిలించాలి.

శ్రీ గణపతి ఉద్వాసనమ్

ఓం గణానాం త్వా గణపతిగ్ం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమమ్ ।
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆ నః శృణ్వన్నూతిభిస్సీద సాదనమ్ ॥
శ్రీ మహాగణాధిపతయే నమః । ఓం భూర్భువస్సువరోం అస్మాద్బింబాత్ ఆవాహితం యథాస్థానం ప్రవేశయామి ॥

శ్రీ దేవీ ఉద్వాసనమ్

ఓం జాతవేదసే సునవామ సోమమరాతీయతో నిదహాతి వేదః ।
స నః పర్షదతి దుర్గాణి విశ్వా నావేవ సింధుం దురితాత్యగ్నిః ॥
తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టామ్ ।
దుర్గాం దేవీగ్ం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః ॥
శ్రీ మహాలక్ష్మీ మహాసరస్వతీ గాయత్రీ సమేత దుర్గా పరమేశ్వర్యై నమః ।
ఓం భూర్భువస్సువరోం అస్మాద్బింబాత్ ఆవాహితం యథాస్థానం ప్రవేశయామి ॥

శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఉద్వాసనమ్

ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః । తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ ।
తే హ నాకం మహిమానస్సచంతే । యత్ర పూర్వే సాధ్యాస్సంతి దేవాః ॥
శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః ।
ఓం భూర్భువస్సువరోం అస్మాద్బింబాత్ ఆవాహితం యథాస్థానం ప్రవేశయామి ॥

శ్రీ అయ్యప్పస్వామి ఉద్వాసనమ్

ఓం నమో భగవతే హరిహరపుత్రాయ పుత్రలాభాయ శత్రునాశనాయ మదగజవాహనాయ ధర్మశాస్త్రే స్వాహా ॥
సపరివారాయ శ్రీ హరిహరపుత్ర అయ్యప్పస్వామినే నమః ।
ఓం భూర్భువస్సువరోం అస్మాద్బింబాత్ ఆవాహితం యథాస్థానం ప్రవేశయామి ॥ స్వామియే శరణం అయ్యప్ప ॥

క్షమా ప్రార్థన

శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ ॥
యస్య స్మృత్యా చ నామోక్త్యా తపఃపూజాక్రియాదిషు ।
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతమ్ ॥
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వర ।
యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే ॥
కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ ।
కరోమి యద్యత్సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి ॥
శ్రీ భూతనాథాయేతి సమర్పయామి ॥ స్వామియే శరణం అయ్యప్ప ॥

తీర్థ స్వీకారః 

ఈ శ్లోకం చదివిన పిమ్మట “ఇతి శంఖతీర్థం ప్రోక్ష్యామి” అని పలుకుతూ కలశంలోని శుద్ధోదకాన్ని భక్తులందరిపై జల్లాలి.

శంఖజల ప్రోక్షణ మంత్రమ్

శంఖమధ్యస్థితం తోయం భ్రామితం కేశవోపరి ।
అంగలగ్నం మనుష్యాణాం బ్రహ్మహత్యాదికం దహేత్ ॥
॥ ఇతి శంఖతీర్థం ప్రోక్ష్య ॥

కుడి చేతిని శంఖము వలె మడిచి తీర్థము మూడుసార్లు స్వీకరించవలెను

తీర్థ గ్రహణ మంత్రమ్

సాలగ్రామశిలావారి పాపహారి విశేషతః ।
అశేషకృతపాపానాం ప్రాయశ్చిత్తం దినే దినే ॥

తీర్థము పుచ్చుకొనుచు

అకాలమృత్యుహరణం సర్వవ్యాధినివారణమ్ ।
సమస్తపాపక్షయకరం శ్రీ హరిహరసుతపాదోదకం పావనం శుభమ్ ॥
అజ్ఞానమూలహరణం జన్మకర్మనివారణమ్ ।
జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం శ్రీ శాస్తా పాదోదకం పిబేత్ ॥

ఈశ్వరార్పణమ్ (ధారాదత్తమ్) 

అక్షతలు, నీళ్ళు తీసుకొని ఈ మంత్రం చదివి, అక్షతలు నీళ్ళు పళ్ళెంలో విడవాలి.

అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః
శ్రీ హరిహరసుతః సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు ॥
ఏతత్ పూజాఫలం సర్వం శ్రీ హరిహరసుత అయ్యప్ప దేవతార్పణమస్తు ॥

ప్రసాదమ్ 

ఓం సహస్ర పరమా దేవీ శతమూలా శతాంకురా ।
సర్వం హరతు మే పాపం దూర్వా దుఃస్వప్ననాశినీ ॥
శ్రీ హరిహరసుత అయ్యప్పస్వామి దేవతా ప్రసాదం శిరసా గృహ్ణామి ॥
శ్రీ అయ్యప్పస్వామి ప్రసాదసిద్ధిరస్తు ॥
హరిః ఓం శ్రీ గురుభ్యో నమః హరిః ఓం ॥ ఓం తత్సత్ ॥
॥ శ్రీ అయ్యప్పస్వామి పూజా సమాప్తా ॥

పూజ చేసిన పుష్పాక్షతలు శిరస్సున ధరించవలెను

ఆశీర్వచన మంత్రమ్

హరిః ఓమ్ ॥ యో వై తాం బ్రహ్మణో వేద । అమృతేనావృతాం పురీమ్ ।
తస్మై బ్రహ్మ చ బ్రహ్మా చ । ఆయుః కీర్తిం ప్రజాం దదుః ॥
భాగధేయేనైనం ప్రణయతి । బ్రాహ్మణ ఆర్షేయ ఉద్ధరేత్ ।
బ్రాహ్మణో వై సర్వా దేవతాః । సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి ।
యావతీర్వై దేవతాస్తాస్సర్వా వేదవిది బ్రాహ్మణే వసంతి ।
తస్మాద్బ్రాహ్మణేభ్యో వేదవిద్భ్యో దివే దివే నమస్కుర్యాన్నాశ్లీలం కీర్తయేత్ ।
ఏతా ఏవ దేవతాః ప్రీణాతి ॥
శతం జీవ శరదో వర్ధమాన ఇత్యపి నిగమో భవతి ।
శతమితి శతం దీర్ఘమాయుః । మరుత ఏనం వర్ధయంతి ।
శతమేనమేవ శతాత్మానం భవతి । శతమనంతం భవతి ।
శతమైశ్వర్యం భవతి । తస్మాచ్ఛతమితి శతం దీర్ఘమాయుః ॥

 శాంతి మంత్రాలు

హరిః ఓమ్ ॥ పృథివీ శాంతా సాగ్నినా శాంతా సా మే శాంతా శుచగ్ం శమయతు ।
అంతరిక్షగ్ం శాంతం తద్వాయునా శాంతం తన్మే శాంతగ్ం శుచగ్ం శమయతు ।
ద్యౌశ్శాంతా సాదిత్యేన శాంతా సా మే శాంతా శుచగ్ం శమయతు ।
పృథివీ శాంతిరంతరిక్షగ్ం శాంతిర్ద్యౌశ్శాంతిర్దిశశ్శాంతిరవాంతరదిశాశ్శాంతిరగ్నిశ్శాంతిర్వాయుశ్శాంతిరాదిత్యశ్శాంతిశ్చంద్రమాశ్శాంతిర్నక్షత్రాణి శాంతిరాపశ్శాంతిరోషధయశ్శాంతిర్వనస్పతయశ్శాంతిర్గౌశ్శాంతిరజా శాంతిరశ్వశ్శాంతిః పురుషశ్శాంతిర్బ్రహ్మ శాంతిర్బ్రాహ్మణశ్శాంతిశ్శాంతిరేవ శాంతిశ్శాంతిర్మే అస్తు శాంతిః ।
తయాహగ్ం శాంత్యా సర్వశాంత్యా మహ్యం ద్విపదే చతుష్పదే చ శాంతిం కరోమి శాంతిర్మే అస్తు శాంతిః ॥

ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్పూర్ణముదచ్యతే ।
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ॥ ఓం శాంతిః శాంతిః శాంతిః ॥

ఓం అసతో మా సద్గమయ । తమసో మా జ్యోతిర్గమయ । మృత్యోర్మా అమృతం గమయ ॥ ఓం శాంతిః శాంతిః శాంతిః ॥
ఓం సర్వేషాం స్వస్తిర్భవతు । ఓం సర్వేషాం శాంతిర్భవతు ।
ఓం సర్వేషాం పూర్ణం భవతు । ఓం సర్వేషాం మంగళం భవతు ॥ ఓం శాంతిః శాంతిః శాంతిః ॥

ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీశాః ।
గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు ॥
లోకాః సమస్తాః సుఖినో భవంతు । లోకాః సమస్తాః చరాచర శ్రేయో భవంతు ॥
సర్వే జనాః సుఖినో భవంతు । సమస్త సన్మంగళాని భవంతు ॥ ఓం శాంతిః శాంతిః శాంతిః ॥
హరిః ఓం — శ్రీ గురుభ్యో నమః — హరిః ఓమ్ ॥ ఓం తత్సత్ ॥

 

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here