మాల పవిత్రత వర్ణన, 150కి పైగా నామాల స్తోత్రం, 18 మెట్ల వర్ణన . ప్రతి పంక్తికీ “శ్రీ ధర్మశాస్తా శిరసానమామి” అనే పల్లవితో తెలుగు భజన.
శ్రీ స్వామియే శరణం అయ్యప్ప ॥ అస్మత్ శ్రీ గురుభ్యో నమః ॥
మాల పవిత్రత / వర్ణన – మాల వర్ణన
- ముత్యాల కాంతితో — మెరిసేటి మాలా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- రతనాల కాంతితో — వెలిగేటి మాలా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- అళుదానదియందు — మునిగేటి మాలా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- సాయుజ్య పదవిని — యోసగేటి మాలా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- కర్పూర జ్యోతితో — కలిసేటి మాలా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- కనక మణి కంఠుని — తులసి మణిమాలా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- ఆర్తితో శరణాలు — పలికించు మాలా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- అయ్యప్పస్వామి యొక్క — అరవింద మాలా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- జాతిమత భేదములు — తొలగించు మాలా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- జగదేకవీరునితో — జతకలుపు మాలా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- పంబానదియందు — మునిగేటి మాలా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- పరితపించే వారు — కోరేటి మాలా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- రుద్రయ్య తనయుని — రుద్రాక్ష మాలా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- శ్రీ హరి తనయుని — శ్రీ గంధ మాలా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- శరవణ సోదరుని — స్ఫటిక మణిమాలా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- కన్నెస్వాముల కంఠ — మలరించు మాలా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- ఆనందరూపుని — ఆశ్రితుల మాలా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- పంచగిరివాసుని — పగడమణి మాలా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- పందళ బాలుని — పావన మాలా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- గణపతి సోదరుని — సుగంధమాలా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- కామక్రోధాదులను — తొలగించు మాలా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- కాంతగిరి నాధుని — కైవల్య మాలా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- కాఠిన్య హృదయాన్ని — కరిగించు మాలా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- కామాక్షి తనయుని — తులసిమణి మాలా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
స్తోత్రమ్ – నామ స్తోత్రం
- శంకర తనయా — శబరిగిరి నిలయా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- మోహినీ తనయా — మోహన రూపా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- పంబాబాలా — పతిత పావనా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- పందళరాజ తనయా — పరమాత్మ రూపా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- భక్త జన రక్షక — శ్రీ భూతనాథా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- సద్గురునాథా — సుందర రూపా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- సంకట నాశకా — సచ్చిదానంద స్వరూపా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- శత్రు సంహారా — శాంత స్వరూపా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- ఆపద్బాంధవా — అనాథ రక్షక — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- అభయ స్వరూపా — అమితగుణాకర — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- ఆశ్రిత వత్సల — ఆనందమూర్తీ — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- అన్నదాన ప్రభువా — అభయ స్వరూప — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- చిన్ముద్రరూపా — చిరుమందహాస — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- మహిషి మర్దన దేవ — మన్మథస్వరూప — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- పదునాల్గు లోకములు — పాలించే స్వామి — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- కానన వాసా — కాంతగిరి దేవా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- అరణ్య వాసా — అయ్యప్ప దేవా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- నామనంబులో నిన్నే — నమ్మి కొలిచేము — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- ముదమార నీముద్ర — మాల దాల్చేము — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- కన్నెస్వామి ప్రియ — కరిమలా నిలయా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- నియమ పాలక ప్రియా — నీలాంబరాయ — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- కార్తీకమాస ప్రియా — కరుణించవయ్యా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- నెయ్యాభిషేక ప్రియా — నీలాంబరాయ — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- గురుస్వామి రూపాయ — గుణగోచరాయ — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- భవబంధనాశాయ — బ్రహ్మానుజాయ — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- గంధాభిషేక ప్రియ — గణపతి సహోదరా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- శరణఘోష ప్రియ — శరవణసోదరా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- శివకేశవాత్మజా — సిద్ధి ప్రదాయకా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- మోహినీ నందనా — మోహాది విభంజనా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- పందళేశుని పుత్ర — వావరుని మిత్ర — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- కేరళ స్థిరవాస — కృష్ణాంబరాయ — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- భూతనాథా — సర్వభూతాదివాస — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- సత్యస్వరూపాయ — సద్బ్రహ్మచారీ — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- అన్నదాతా దేవ — అభయ ప్రదాయ — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- కలిదోష హారకా — కరిమలావాసా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- శక్తి స్వరూపాయ — శబరిమల నిలయా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- హరి హర నందన — ఆనంద వర్ధనా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- శబరి నిరోధాయ — శబరి మోక్షాయ — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- వన్పులి వాహనా — విల్లాలి వీరా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- శ్రీ పూర్ణ పుష్కల — సిరినొసలి తిలకమా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- కన్నెస్వామి ప్రియ — కాంతిమలవాసా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- విల్లాలివీరా — వీరమణి కంఠా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- పట్టబంధాసనా — పరమాత్మరూప — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- అతిలోక సుందరా — అమితగుణాకర — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- గురువులకు గురువైన — శ్రీ గోప్తృశాస్తా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- పాలాభిషేకప్రియ — పందళ నరేశా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- ఇంద్రాది సురకోటి — వందితాచరణా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- గురుపుత్రునకు కనులు — పలుకు లిచ్చేస్వామి — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- సర్వహృదయావాస — శార్దూల గంధర్వ — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- హరిహరాసనా — భూరిగజవాహనా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- గరుడ వాహన పుత్ర — గాంధర్వలోల — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- జ్ఞాన స్వరూపాయ — జ్ఞానదాతాయ — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- మకరజ్యోతి స్వరూప — మా అయ్యప్ప స్వామి — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- నాగరాజారూప — నర్తన ప్రియాయ — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- ఆర్త రక్షక స్వామి — ఆపన్నివారా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- భస్మాభిషేక ప్రియ — భాగవతోత్తమ — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- సురమకుట మణిగణ — రంజితాచరణా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- లావణ్య రూపాయ — లక్ష్మీ కుమారాయ — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- షణ్ముఖునిసోదరా — షడ్వర్గవారయ — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- పంపాతటీ వాస — పాపనాకృతియే — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- ప్రాణ స్వరూపా — పార్వతీపుత్రా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- యోగసంయోగాయ — యోగి గమ్యాయ — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- వేద వేదాంతాయ — విష్ణుసంభూతా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- శతకోటి మన్మథ — సౌందర్యమూర్తీ — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- సిరిసంపదలనిచ్చు — చిన్నారి స్వామి — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- పద్దెనిమిది మెట్లపైనున్న — పరమాత్మ రూపా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- తారక ప్రభువే — భవతార కాయ — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- ఆశ్రితాఖిలదాయ — అమితగుణదాయ — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- ఇరుముడి ప్రియ — ఈశిత్వదాయ — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- మన్మథస్వరూపా — మహిషి సంహార — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- పరబ్రహ్మ రూపాయ — పరమాత్మకాయ — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- అళుదానదీ కృతే — ఎరిమేలి శాస్తా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- లోక శాస్తాదేవ — ధర్మశాస్తావే — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- కోటి భాస్కరతేజ — కోమలస్వరూప — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- దండిగామాకీయు — అండదండలనూ — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- కోదండ పాణి — మా కోరికలు తీర్చు — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- హంస స్వరూపాయ — పరమ హంసాయ — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- శుద్ధ చైతన్యాయ — శ్రుతి వందితాయ — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- వైరాగ్య కారకం — వైభోగదాయకం — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- కంజదళ నేత్రం — కమనీయగాత్రం — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- బాల స్వరూపాయ — బ్రహ్మాండతేజ — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- మహిషి మర్దనదేవ — మోక్షప్రదాత — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- కామితార్థప్రదా — కళ్యాణమూర్తీ — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- దివ్య స్వరూపా — దేవాదిదేవా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- పాప సంతాపా — పావననామా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- శరణ మంటేచాలు — కరుణించు తండ్రీ — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- కణ్ణగీ రక్షకా — కాపాడవయ్యా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- పింజళ ప్రియదేవా — ప్రీతి వర్ధాయ — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- భవబంధనాశాయ — భావనాతీతా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- సర్వరోగములనూ — సమయించు స్వామీ — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- ఏడేడులోకముల — ఏకైకనేతా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- మాదరిద్రము బాపి — మమ్ము కాపాడు — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- మా పాపములనెల్ల — మన్నించు ప్రోచు — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- కర్మములు తప్పించి — కాపాడుమయ్యా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- మా కోరికలు దీర్చు — మమ్ము రక్షించు — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- మా మనోబుద్ధులను — మంచి గావుంచు — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- అసమానతేజా — అమితగుణాకర — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- దైవరాజాయ — దయగల ప్రభువా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- దుష్ట శిక్షక సర్వ — శిష్ట సంరక్షకా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- జగదేకవీరాయ — జలజనేత్రాయ — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- కామక్రోధలోభ — మోహమదనాశ — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- మాత్సర్యనాశాయ — మణికంధరాయ — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- అతిదయాళోస్వామి — అమరవంద్యాయ — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- తల్లిదండ్రియు గురువు — దైవమ్ము నీవే — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- సుజ్ఞానరూపాయ — సురసేవితాయ — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- వైరాగ్య జితశుకా — వైభవకుబేరా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- శ్రుతి శిఖర సంచార — శ్రిత రక్షకాయ — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- అపురూప సుందరా — ఆదిత్య తేజా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- కవిజనాశ్రయ పాద — కళ్యాణభూజా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- కష్టము లెల్లను బాపి — కరుణించుస్వామీ — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- కలిదోషనాశాయ — కైవల్యదాయా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- పరమేశ శబరీశ — పరమ దయాళో — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
చివరి పంక్తిని మూడు పర్యాయాలు పాడాలి.
18 మెట్ల వర్ణన – పదునెనిమిది మెట్లు
- ఒకటవ మెట్టె — ఓంకారమూర్తీ — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- రెండవమెట్టె — హరిహర తనయా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- మూడవమెట్టె — మోహిని తనయా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- నాల్గవమెట్టె — నారాయణ తనయా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- ఐదవమెట్టె — ఐయ్యప్ప దేవ — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- ఆరవమెట్టె — ఆర్ముగసోదరా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- ఏడవమెట్టె — ఏకాంతవాసా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- ఎనిమిదవమెట్టె — ఎరుమేలివాసా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- తొమ్మిదవమెట్టె — నవగ్రహనాయకా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- పదవమెట్టె — పరమదయాళ — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- పదకొండవ మెట్టె — పరమాత్మరూప — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- పన్నెండవమెట్టె — పాపసంహార — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- పదమూడవమెట్టె — పరమ పావనా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- పదునాల్గవమెట్టె — పరసుఖదాయకా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- పదునైదవమెట్టె — పరశురామ ప్రతిష్ఠిత — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- పదహారవమెట్టె — పతితపావనా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- పదిహేడవమెట్టె — పార్వతినందనా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
- పద్దెనిమిదవమెట్టె — పంచగిరీశ్వరా — శ్రీ ధర్మశాస్తా శిరసానమామి
సర్వం శ్రీ హరిహరసుతార్పణమస్తు — స్వామియే శరణం అయ్యప్ప ॥
ఇది తెలుగు/మలయాళ పదాలతో పాడే భజన; ఇతర భాషల వారు తమ లిపిలో చదివి అదే రాగంలో పాడవచ్చు.


