మాలాధారణ నుండి మాలా విసర్జన వరకు గురుస్వామి వారికి దక్షిణ సమర్పించే ఏడు సందర్భాలు.
మాల ధరించి శబరిమల యాత్రకు వెళ్ళే భక్తులకు మాలాధారణ మొదలు మాలా విసర్జన వరకు గురుస్వామి గారి సహకారం ఎంతో అవసరం. కావున తమలపాకులు, వక్కలు, యథాశక్తి దక్షిణను గురువు గారికి “గురుదక్షిణ”గా సమర్పించే ఆచారాన్ని పెద్దలు ఏర్పరచారు. గురుదక్షిణ భక్తులు తమ శక్తి కొలది ఇచ్చేదే — దీనికి ఎటువంటి నిబంధన లేదు.
- మాలాధారణ సమయంలో
- పూజలు చేయించుకునే వేళ
- ఇరుముడి కట్టించుకునే వేళ
- ఎరుమేలిలో పేటతుళ్ళి ముగించుకొని వనయాత్రకు బయలుదేరే వేళ
- పంబా స్నానం ముగిసి ఇరుముడి ఎత్తుకునే వేళ
- దర్శనాదులు ముగిసి సన్నిధానం నుండి తిరుగు ప్రయాణమయ్యే వేళ
- మాలా విసర్జన సమయంలో
పై ఏడు పర్యాయాలు గురుస్వామి గారికి మాలాధారులైన భక్తులు గురుదక్షిణ ఇచ్చుకోవాలనేది విధి.
ఓం స్వామియే శరణం అయ్యప్ప.



[…] గురుదక్షిణ — ఏడు సమయాలు […]
[…] గురుదక్షిణ — ఏడు సమయాలు […]
[…] గురుదక్షిణ — ఏడు సమయాలు […]