శ్రీ అయ్యప్పస్వామి నామములు (గోవింద నామాల వరుసలో)

0

“అయ్యప్పా స్వామి అయ్యప్పా, హరిహరనందన అయ్యప్పా” పల్లవితో అయ్యప్ప నామ భజన – సామూహిక భజనకు అనువైనది.

నాహం వసామి వైకుంఠే న యోగిహృదయే రవౌ ।
మద్భక్తా యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద ॥

“ఓ నారదా! నేను వైకుంఠంలోనూ, యోగుల హృదయాలలోనూ, రవిమండలంలోనూ ఉండను. ఎక్కడ నా భక్తులు గానం చేస్తారో నేను అక్కడే ఉంటాను” — శ్రీ మహావిష్ణువు నారద మహర్షితో చెప్పిన మాట. గోవింద నామాల వరుసలో, ప్రతి చరణం తరువాత పల్లవి పాడాలి.

పల్లవి

అయ్యప్పా స్వామి అయ్యప్పా
హరి హర నందన అయ్యప్పా ।
అయ్యప్పా స్వామి అయ్యప్పా
శబరిగిరీశ్వర అయ్యప్పా ॥

స్వామి శరణం అయ్యప్పా
శరణం శరణం అయ్యప్పా ।
శ్రీ ధర్మశాస్తా అయ్యప్పా
శబరిమలనిలయా అయ్యప్పా ।
హరి హర సుత అయ్యప్పా
హరిహరాత్మజా అయ్యప్పా ॥

భక్త వత్సల అయ్యప్పా
భాగవత ప్రియ అయ్యప్పా ।
భూలోకనాథా అయ్యప్పా
శ్రీ భూతనాథా అయ్యప్పా ।
బ్రహ్మాండరూప అయ్యప్పా
భక్తజన రక్షక అయ్యప్పా ।
భవ బంధనాశా అయ్యప్పా
బ్రహ్మానుజాయ అయ్యప్పా ।
భస్మాభిషేక ప్రియ అయ్యప్పా
భాగవతోత్తమ అయ్యప్పా ॥

ఆపద్బాంధవా అయ్యప్పా
అనాథరక్షక అయ్యప్పా ।
అభయ హస్త ప్రద అయ్యప్పా
అభయ స్వరూప అయ్యప్పా ।
అమిత గుణాకర అయ్యప్పా
అభిషేక ప్రియ అయ్యప్పా ।
ఆనందముద్ర అయ్యప్పా
ఆపన్నివారణ అయ్యప్పా ।
ఆర్యదాత అయ్యప్పా
ఆర్యనాథ అయ్యప్పా ।
ఆనందరూప అయ్యప్పా
శ్రితవత్సల అయ్యప్పా ॥

సత్య స్వరూప అయ్యప్పా
సాధుజన రక్షక అయ్యప్పా ।
సద్గురునాథ అయ్యప్పా
సంకట నాశక అయ్యప్పా ।
సుందర రూపా అయ్యప్పా
సద్గుణ మూర్తి అయ్యప్పా ।
స్వయం ప్రకాశా అయ్యప్పా
సచ్చిదానంద స్వరూపా అయ్యప్పా ॥

శరవణ సోదర అయ్యప్పా
శరణుఘోష ప్రియ అయ్యప్పా ।
శిష్టరక్షక అయ్యప్పా
కష్ట నివారణ అయ్యప్పా ।
శరణాగత వత్సల అయ్యప్పా
శబరి మోక్షదాయక అయ్యప్పా ।
శాంత స్వరూప అయ్యప్పా
శాంతమూర్తి అయ్యప్పా ।
శక్తి స్వరూప అయ్యప్పా
శత్రు సంహార అయ్యప్పా ॥

కరుణామూర్తి అయ్యప్పా
కళ్యాణమూర్తి అయ్యప్పా ।
కరుణాసాగర అయ్యప్పా
కలిదోషహర అయ్యప్పా ।
కమల దళాక్ష అయ్యప్పా
కామిత ఫలదాత అయ్యప్పా ।
కస్తూరి తిలకా అయ్యప్పా
కాంచనాంబరధర అయ్యప్పా ।
కలియుగవరద అయ్యప్పా
కాననవాసా అయ్యప్పా ।
కర్పూర జ్యోతి ప్రియ అయ్యప్పా
కామితార్థ ప్రద అయ్యప్పా ॥

పురాణ పురుష అయ్యప్పా
పరమ పావనా అయ్యప్పా ।
పాప విమోచక అయ్యప్పా
పంబాబాలా అయ్యప్పా ।
పాప వినాశ అయ్యప్పా
పరమ దయామయ అయ్యప్పా ।
పూర్ణ పుష్కలాప్రియ అయ్యప్పా
ప్రసన్న మూర్తి అయ్యప్పా ।
పట్టబంధాసనా అయ్యప్పా
పరమాత్మరూప అయ్యప్పా ॥

నిత్య నిర్మలా అయ్యప్పా
నీలిమల వాసా అయ్యప్పా ।
నిర్మలాత్మ అయ్యప్పా
నిత్య బ్రహ్మచారి అయ్యప్పా ।
నిత్యశుభప్రద అయ్యప్పా
నిఖిలలోకేశా అయ్యప్పా ॥

ప్రత్యక్షదేవ అయ్యప్పా
పరమ దయాకర అయ్యప్పా ।
పరసుఖ దాయక అయ్యప్పా
పరశురామ ప్రతిష్ఠిత అయ్యప్పా ।
పార్వతి నందన అయ్యప్పా
పంచగిరీశ్వర అయ్యప్పా ।
పతితపావనా అయ్యప్పా
పాప సంహార అయ్యప్పా ॥

లోకరక్షక అయ్యప్పా
లోకపూజిత అయ్యప్పా ।
గజముఖసోదర అయ్యప్పా
గంధాభిషేక ప్రియ అయ్యప్పా ।
రత్నకిరీటా అయ్యప్పా
రాజరాజ సోదర అయ్యప్పా ।
చిన్ముద్ర రూప అయ్యప్పా
చిరుమందహాస అయ్యప్పా ॥

జగన్మోహన అయ్యప్పా
జ్యోతి స్వరూప అయ్యప్పా ।
జ్ఞాన స్వరూప అయ్యప్పా
జ్ఞాన ప్రదాత అయ్యప్పా ।
వజ్రకవచధర అయ్యప్పా
వన్‌పులివాహన అయ్యప్పా ।
వజ్రమకుటధర అయ్యప్పా
శ్రీ విశ్వశాస్తా అయ్యప్పా ।
వేదాంతవేద్య అయ్యప్పా
వీరేంద్ర వందిత అయ్యప్పా ॥

మోహనరూపా అయ్యప్పా
మోక్ష ప్రదాత అయ్యప్పా ।
మోహిని నందన అయ్యప్పా
మహిషి మర్దన అయ్యప్పా ।
ముక్తి ప్రదాత అయ్యప్పా
మహా తపస్వీ అయ్యప్పా ।
మదగజవాహన అయ్యప్పా
మహాపాపవినాశ అయ్యప్పా ॥

దుష్ట సంహార అయ్యప్పా
దురిత నివారణ అయ్యప్పా ।
దేవాది దేవా అయ్యప్పా
దయామయా అయ్యప్పా ।
ధర్మ సంస్థాపక అయ్యప్పా
దీనజన రక్షక అయ్యప్పా ।
ధర్మ రక్షక అయ్యప్పా
దినకరతేజ అయ్యప్పా ।
ధరణీనాయక అయ్యప్పా
దివ్య స్వరూప అయ్యప్పా ॥

సర్వం శ్రీ హరిహరసుతార్పణమస్తు – స్వామియే శరణం అయ్యప్ప ॥

ఇది తెలుగు/మలయాళ పదాలతో పాడే భజన; ఇతర భాషల వారు తమ లిపిలో చదివి అదే రాగంలో పాడవచ్చు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here