18 మెట్ల విశిష్ట పరమార్థం – మెట్ల పవిత్రత

0

పంచేంద్రియాలు, అష్టరాగాలు, త్రిగుణాలు, విద్య-అవిద్య – 18 మెట్లు దేనికి ప్రతీకలు; ఒక్కో మెట్టుకు భజనలో చెప్పే నామం.

సన్నిధానం ముంగిట ఉన్న పదునెట్టాంబడి – 18 మెట్లు – సాక్షాత్ 18 దేవతల స్వరూపాలుగా పూజింపబడతాయి. గురుస్వామి వారి గ్రంథం ప్రకారం భక్తుడు అష్టరాగాలు (8), పంచ జ్ఞానేంద్రియాలు (5), త్రిగుణాలు (3), విద్య-అవిద్య (2) – ఈ పదునెనిమిదిని అధిగమించి, ఇరుముడితో శబరిమల చేరుతాడు. మానవులలో వ్యాపించియుండే దుర్గుణాలను ఒక్కొక్కటి తొలగించి, వాటి స్థానంలో సద్గుణాలను ఆవాహించే పుణ్యసోపానాలే ఈ మెట్లు.

మెట్టు కొలిచే నామం (శిరసానమామి భజన నుండి)
1 ఓంకారమూర్తీ
2 హరిహర తనయా
3 మోహిని తనయా
4 నారాయణ తనయా
5 ఐయ్యప్ప దేవ
6 ఆర్ముగసోదరా
7 ఏకాంతవాసా
8 ఎరుమేలివాసా
9 నవగ్రహనాయకా
10 పరమదయాళ
11 పరమాత్మరూప
12 పాపసంహార
13 పరమ పావనా
14 పరసుఖదాయకా
15 పరశురామ ప్రతిష్ఠిత
16 పతితపావనా
17 పార్వతినందనా
18 పంచగిరీశ్వరా

మెట్ల పవిత్రత – పాటించవలసినవి

  • మండల కాల (41 రోజుల) దీక్ష పూర్తి చేసి, తలపై ఇరుముడి ఉన్నవారే 18 మెట్లు ఎక్కాలి.
  • మెట్లు ఎక్కే ముందు శూర టెంకాయ కొట్టాలి; తిరుగు ప్రయాణంలో మెట్లు దిగేటప్పుడు కూడా కొట్టాలి.
  • మెట్లు ఎక్కేటప్పుడు శరణు ఘోష, పడిపాట చేస్తూ ఎక్కాలి.
  • ఇరుముడి లేకుండా దర్శనానికి వెళ్ళేవారు ప్రత్యేక మార్గంలో వెళ్ళాలి — మెట్లు ఎక్కరాదు.

అష్టాదశ సోపాన దేవతలు

మెట్టు అధిష్ఠాన దేవత
1 శ్రీ మహాగణపతి
2 శ్రీ పరమేశ్వరుడు (శివుడు)
3 శ్రీ పార్వతీ దేవి
4 శ్రీ సుబ్రహ్మణ్యస్వామి
5 శ్రీ బ్రహ్మదేవుడు
6 శ్రీ మహావిష్ణువు
7 శ్రీ రంగనాథుడు
8 శ్రీ మహాకాళి
9 శ్రీ యమధర్మరాజు
10 శ్రీ సూర్యుడు
11 శ్రీ చంద్రుడు
12 శ్రీ అంగారకుడు (కుజుడు)
13 శ్రీ బుధుడు
14 శ్రీ బృహస్పతి (గురువు)
15 శ్రీ శుక్రుడు
16 శ్రీ శనైశ్చరుడు
17 శ్రీ రాహువు
18 శ్రీ కేతువు

ఒక్కో దేవత ధ్యాన శ్లోకం, పూజా మంత్రం: అష్టాదశ సోపాన దేవతా పూజ.

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here