శబరిమలలో ప్రతి రాత్రి పాడే హరివరాసనం ఎనిమిది శ్లోకాలు, ప్రతి శ్లోకానికి సరళమైన తెలుగు అర్థంతో.
“హరివరాసనం” శబరిమల సన్నిధానంలో ప్రతి రాత్రి గుడి తలుపులు మూసే ముందు పాడే శయన గీతం (ఉరక్కుపాట్టు). దీనిని రాత్రి సమయంలోనే చదవాలి. ప్రతి శ్లోకం తరువాత “శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా” అని పాడాలి.
1. హరివరాసనం స్వామి విశ్వమోహనం
హరిదధీశ్వరం స్వామి ఆరాధ్యపాదుకమ్ ।
అరివిమర్దనం స్వామి నిత్యనర్తనం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే ॥
శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా ।
శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా ॥
లోకాన్ని మోహింపజేసేవాడు, శ్రేష్ఠమైన ఆసనంపై ఉన్నవాడు, సూర్యునికి ప్రభువు, ఆరాధింపబడే పాదుకలు గలవాడు, శత్రువులను మర్దించేవాడు, నిత్యం ఆనందతాండవం చేసేవాడు – హరిహరపుత్రుడైన ఆ దేవుని ఆశ్రయిస్తున్నాను.
2. శరణకీర్తనం స్వామి భక్తమానసం
భరణలోలుపం స్వామి నర్తనాలసమ్ ।
అరుణభాసురం స్వామి భూతనాయకం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే ॥
శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా ।
శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా ॥
శరణఘోషలో ఆనందించేవాడు, భక్తుల మనసులో ఉండేవాడు, లోకాన్ని పాలించడంలో ఆసక్తి గలవాడు, నర్తనప్రియుడు, అరుణకాంతితో ప్రకాశించే భూతనాథుడు.
3. ప్రణయసత్యకం స్వామి ప్రాణనాయకం
ప్రణతకల్పకం స్వామి సుప్రభాంచితమ్ ।
ప్రణవమందిరం స్వామి కీర్తనప్రియం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే ॥
శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా ।
శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా ॥
సత్యమే ప్రేమగా గలవాడు, ప్రాణాలకు నాయకుడు, నమస్కరించిన వారికి కల్పవృక్షం, దివ్యకాంతితో అలరారేవాడు, ఓంకారానికి నిలయం, కీర్తనప్రియుడు.
4. తురగవాహనం స్వామి సుందరాననం
వరగదాయుధం స్వామి వేదవర్ణితమ్ ।
గురుకృపాకరం స్వామి కీర్తనప్రియం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే ॥
శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా ।
శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా ॥
అశ్వవాహనుడు, సుందరమైన ముఖం గలవాడు, శ్రేష్ఠమైన గదను ఆయుధంగా ధరించినవాడు, వేదాలు వర్ణించినవాడు, గురువులా కృప చూపేవాడు.
5. త్రిభువనార్చితం స్వామి దేవతాత్మకం
త్రినయనం ప్రభుం స్వామి దివ్యదేశికమ్ ।
త్రిదశపూజితం స్వామి చింతితప్రదం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే ॥
శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా ।
శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా ॥
మూడు లోకాలు పూజించేవాడు, దేవతలందరి ఆత్మ, ముక్కంటి వంటి ప్రభువు, దివ్యమైన గురువు, దేవతలు పూజించేవాడు, కోరినది ఇచ్చేవాడు.
6. భవభయాపహం స్వామి భావుకావహం
భువనమోహనం స్వామి భూతిభూషణమ్ ।
ధవళవాహనం స్వామి దివ్యవారణం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే ॥
శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా ।
శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా ॥
సంసార భయాన్ని పోగొట్టేవాడు, శుభాన్ని తెచ్చేవాడు, లోకాన్ని మోహింపజేసేవాడు, విభూతి అలంకారుడు, తెల్లని ఏనుగు వాహనుడు.
7. కళమృదుస్మితం స్వామి సుందరాననం
కళభకోమలం స్వామి గాత్రమోహనమ్ ।
కళభకేసరీ స్వామి వాజివాహనం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే ॥
శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా ।
శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా ॥
మృదువైన చిరునవ్వు గలవాడు, సుందరముఖుడు, ఏనుగు పిల్లలా కోమలుడు, మనోహరమైన శరీరం గలవాడు, సింహం, గుర్రం వాహనాలుగా గలవాడు.
8. శ్రితజనప్రియం స్వామి చింతితప్రదం
శ్రుతివిభూషణం స్వామి సాధుజీవనమ్ ।
శ్రుతిమనోహరం స్వామి గీతలాలసం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే ॥
శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా ।
శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా ॥
ఆశ్రయించిన వారికి ప్రియుడు, కోరినది ఇచ్చేవాడు, వేదాలకు ఆభరణం, సాధువుల జీవనం, వేదమనోహరుడు, సంగీతప్రియుడు.


