నైవేద్య పదార్థాలు – సంస్కృత నామాలు

0

నైవేద్యం సమర్పించేటప్పుడు “… నివేదయామి” అని పదార్థం పేరు చెప్పాలి. ఉదాహరణ: “కదళీఫలం నివేదయామి”. ఈ పుటలో ప్రతి పదార్థానికి సంస్కృత నామం, దాని తెలుగు అర్థం ఇవ్వబడ్డాయి.

పండ్లు, ఇతర నివేదనలు

సంస్కృత నామం తెలుగు పేరు
కదళీఫలం అరటిపండు
సేవ్ ఫలం ఆపిల్ పండు
జామీ ఫలం జామపండు
దాడిమీ ఫలం దానిమ్మ పండు
ద్రాక్షా ఫలం ద్రాక్ష పండ్లు
నారంగ ఫలం నారింజ పండు
చూతఫలం మామిడిపండు
బహుబీజ ఫలం పిక్కలు ఎక్కువగా ఉన్న పండ్లు
నారికేళ ఖండ ద్వయం రెండు కొబ్బరి చెక్కలు
ఖర్జూర ఫలం ఖర్జూరం
అనాస ఫలం అనాసపండు
మధుకర్కటీ ఫలం బొప్పాయి పండు
బదరీఫలం రేగుపండు
జంబూఫలం నేరేడు పండు
ఇక్షుఖండం చెరకు ముక్క
భల్లాతకీ జీడిపప్పు
శుష్కద్రాక్ష కిస్మిస్
పనస ఫలం పనసపండు
గుడశకలం బెల్లం ముక్క
ముద్గసూపం వడపప్పు
గుడపిష్ట బెల్లం చలిమిడి
శర్కర పిష్ట పంచదార చలిమిడి
గుడపానీయం బెల్లం పానకం
శర్కర పానీయం పంచదార పానకం
పృథుక్ అటుకులు
పృథుకాపాయసం అటుకుల పాయసం

మహానైవేద్యానికి వండిన పదార్థాలు

సంస్కృత నామం తెలుగు పేరు
భక్ష్యము పిండివంటలు / ఘన పదార్థాలు
భోజ్యము పల్చని మృదు పదార్థాలు
చోష్యము రస పదార్థాలు
లేహ్యము చప్పరించి తినదగు పదార్థాలు
పేయాత్మకము పానయోగ్యమైనవి
దధి దుగ్ధ ముగ్ధం పెరుగు, పాలతో చేసిన పదార్థాలు
ముద్గాన్నము కట్టుపొంగలి
చిత్రాన్నము పులిహోర
గుడాన్నము బెల్లపు పరమాన్నం / చక్రపొంగలి
దధ్యోదనము పెరుగు అన్నం
ముద్గలాన్నము పెసరపప్పు అన్నం
శాకాన్నము కూరముక్కలతో అన్నం
పాయసాన్నము పరమాన్నం
క్షీరాన్నము పాయసం
గుడపాయసము బెల్లం పరమాన్నం
తిలాన్నం నువ్వుల పొడితో చేసిన అన్నం
సుపాద గోధుమ నూక, ఆవునెయ్యి, బెల్లం, సుగంధ ద్రవ్యాలతో చేసిన ప్రసాదం (అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం వంటిది)
శాల్యన్నము అన్నం
మాషాపూపం మినప గారెలు
గుడాపూపం బెల్లం గారెలు
అపూపం అరిసెలు
కడుప / మోదకం ఉండ్రాళ్ళు
లడ్డుకం లడ్డూలు
పూపం అప్పాలు

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here