యాత్ర ముగిసిన తరువాత మాల తీసే విధానం, మాలా విసర్జన మంత్రం, అశుభ సమయంలో పాటించవలసినవి.
విధానం
- శబరిమల యాత్ర ముగించుకొని స్వగ్రామం చేరిన తరువాత, ఇరుముడి కట్టిన దేవాలయానికి రావాలి.
- దేవాలయ ముంగిట కొబ్బరికాయ కొట్టి, స్వామివారిని దర్శించుకోవాలి.
- స్వామివారికి కర్పూర హారతి చూపించి, శరణాలు చెబుతూ సాష్టాంగ దండ ప్రణామం ఆచరించాలి.
- గురుస్వామి గారు చెప్పిన మాలా విసర్జన మంత్రాన్ని పఠించాలి.
- స్వామికి మనసారా నమస్కరించి, శరణాలు చెబుతుండగా గురుస్వామి గారు భక్తుని మెడలోని దీక్షమాలను తీస్తారు. అంతటితో దీక్ష పూర్తి అవుతుంది.
- మాలా విసర్జనానంతరం గురుస్వామి గారికి దక్షిణ తాంబూలాదులు సమర్పించి, సాష్టాంగ ప్రణామం చేసి ఆశీర్వాదం పొందాలి.
మాలా విసర్జన మంత్రం
అపూర్వమచలారోహం దివ్యదర్శన కారణాత్ ।
శాస్త్రముద్రాత్మకా దేవ దేహి మే వ్రతమోచనమ్ ॥
స్వామి భక్తులు తమ నిత్య జీవితంలో మనో వాక్కాయ కర్మల చేత ఎదుటివారికి అపకారం జరగకుండా, యథాశక్తి మానవసేవతో, సనాతన ధార్మిక తత్త్వాలతో, క్షమాది గుణాలతో, సర్వజనులకు ఉపకారం చేసే సద్బుద్ధితో మెలగుతూ జీవితాన్ని సాగించాలి.
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప.
అశుభ సందర్భం ఎదురైనప్పుడు
- అశుభ సూతకం కలిగి మాల తీయవలసి వస్తే, దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ముద్రమాలను తీయాలి.
- మధ్యలో దీక్ష విరమించవలసి వచ్చినవారు సూతకం తొలగిన పిమ్మట 41 రోజులు దీక్ష వహించే అవకాశం ఉంటే మళ్ళీ మాల ధరించాలి; లేనిచో తదుపరి సంవత్సరం మాల ధరించి శబరిమల యాత్ర చేయాలి.



[…] మాలా విసర్జన […]
[…] మాలా విసర్జన […]
[…] మాలా విసర్జన […]
[…] మాలా విసర్జన […]
[…] మాలా విసర్జన […]