పంచామృత స్నానం తరువాత ఒక్కొక్క ద్రవ్యంతో, దాని వేదమంత్రంతో స్వామికి అభిషేకం చేయాలి. పంచామృతాలు అంటే ఆవుపాలు, ఆవుపెరుగు, ఆవునెయ్యి, తేనె, శర్కర (పటిక పంచదార పొడి).
ఆవుపాలు
ఆవుపాలతో స్వామివారికి అభిషేకం చేస్తూ
ఓమ్ ॥ ఆప్యాయస్వ సమేతు తే విశ్వతస్సోమ వృష్ణియమ్ । భవా వాజస్య సంగథే ॥
ఓం నమో భగవతే … ధర్మశాస్త్రే స్వాహా । సపరివారాయ … నమః ।
క్షీరేణ స్నపయామి ॥ స్వామియే శరణం అయ్యప్ప ॥
పెరుగు
ఆవుపాల పెరుగుతో అభిషేకం చేస్తూ
ఓమ్ ॥ దధిక్రావ్ణ్ణో అకారిషం జిష్ణోరశ్వస్య వాజినః । సురభి నో ముఖా కరత్ప్రణ ఆయూగ్ంషి తారిషత్ ॥
ఓం నమో భగవతే … ధర్మశాస్త్రే స్వాహా । సపరివారాయ … నమః ।
దధ్నా స్నపయామి ॥ స్వామియే శరణం అయ్యప్ప ॥
నెయ్యి
ఆవు నెయ్యితో అభిషేకం చేస్తూ
ఓమ్ ॥ శుక్రమసి జ్యోతిరసి తేజోఽసి దేవో వస్సవితోత్పునాత్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసోస్సూర్యస్య రశ్మిభిః ॥
ఓం నమో భగవతే … ధర్మశాస్త్రే స్వాహా । సపరివారాయ … నమః ।
ఆజ్యేన స్నపయామి ॥ స్వామియే శరణం అయ్యప్ప ॥
తేనె
తేనెతో అభిషేకం చేస్తూ
ఓమ్ ॥ మధు వాతా ఋతాయతే మధు క్షరంతి సింధవః । మాధ్వీర్నస్సంత్వోషధీః ।
మధు నక్తముతోషసి మధుమత్పార్థివగ్ం రజః । మధు ద్యౌరస్తు నః పితా ।
మధుమాన్నో వనస్పతిర్మధుమాగ్ం అస్తు సూర్యః । మాధ్వీర్గావో భవంతు నః ॥
ఓం నమో భగవతే … ధర్మశాస్త్రే స్వాహా । సపరివారాయ … నమః ।
మధునా స్నపయామి ॥ స్వామియే శరణం అయ్యప్ప ॥
పటిక / పంచదార పొడి
పటిక పంచదార పొడితో అభిషేకం చేస్తూ
ఓమ్ ॥ స్వాదుః పవస్వ దివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ సుహవీతు నామ్నే । స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగ్ం అదాభ్యః ॥
ఓం నమో భగవతే … ధర్మశాస్త్రే స్వాహా । సపరివారాయ … నమః ।
శర్కరయా స్నపయామి ॥ స్వామియే శరణం అయ్యప్ప ॥
పండ్ల రసం, కొబ్బరి నీళ్లు
పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లతో అభిషేకం చేస్తూ
ఓమ్ ॥ యాః ఫలినీర్యా అఫలా అపుష్పా యాశ్చ పుష్పిణీః । బృహస్పతిప్రసూతాస్తా నో ముంచంత్వగ్ంహసః ॥
నారికేళఫలోద్భూతం త్రినేత్రహరసమ్మితమ్ ।
శిఖయా దురితం సర్వం పాపం పీడాం చ మే నుద ॥
ఓం నమో భగవతే … ధర్మశాస్త్రే స్వాహా । సపరివారాయ … నమః ।
ఫలోదకేన స్నపయామి ॥ నారికేళ జలేనాభిషేచనం కుర్యాత్ ॥ స్వామియే శరణం అయ్యప్ప ॥
విభూతి
విభూతితో అభిషేకం చేస్తూ
ఓమ్ ॥ విభూతిర్భూతిరైశ్వర్యం అపమృత్యుహరం శుభమ్ ।
స్నానార్థం తే ప్రయచ్ఛామి గృహ్యతాం సురనాయక ॥
ఓం నమో భగవతే … ధర్మశాస్త్రే స్వాహా । సపరివారాయ … నమః ।
విభూతిం స్నపయామి ॥ స్వామియే శరణం అయ్యప్ప ॥
గంధం
గంధంతో అభిషేకం చేస్తూ
శ్రీఖండం చందనం దివ్యం గంధాఢ్యం సుమనోహరమ్ ।
విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం చందనం ప్రతిగృహ్యతామ్ ॥
ఓం నమో భగవతే … ధర్మశాస్త్రే స్వాహా । సపరివారాయ … నమః ।
చందనం స్నపయామి ॥ స్వామియే శరణం అయ్యప్ప ॥
ఇటుపై “శ్రీ రుద్ర నమక చమకాదులు”, శ్రీసూక్త, పురుషసూక్తాదులు మున్నగునవి చదువుతూ పాలు, పంచామృతాలు, కొబ్బరి నీళ్లు, జలం, పలురకాల పండ్ల రసాలు ఇత్యాదులతో అఖండంగా అభిషేకం చేయవచ్చు. చూడండి: రుద్రం, పురుషసూక్తం, శ్రీసూక్తం.
మధుర పంచామృతం
పాలు, పెరుగు, (కొద్దిగా) నెయ్యి, తేనె, శర్కర కలిపిన పంచామృతాలలో అరటి పండ్లు, ఎండుద్రాక్ష, జీడిపప్పు, కిస్మిస్, బాదం, పిస్తా, బెల్లం, కొద్దిగా ఏలకుల పొడి, కొద్దిగా పచ్చ కర్పూరం మొదలైనవి రుచికొరకు కలుపుతారు. దానినే “మధుర పంచామృతం” అంటారు. విగ్రహమైతే దానితో అభిషేకం చేయవచ్చు; చిత్రపటమైతే పుష్పంతో చిలకరించవచ్చు – అదియే పంచామృత స్నానం. నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించవచ్చు.


