శ్రీ అయ్యప్పస్వామి పూజా విధానం (వేదోక్తం – న్యాసపూర్వకం)

0

ఈ పూజ వేదోక్తంగా, న్యాసపూర్వకంగా జరుగుతుంది:
ముందు శాస్తా యొక్క నాలుగు ధ్యానాలు, న్యాసాలు, పంచపూజ, ప్రాణప్రతిష్ఠ; తరువాత పురుషసూక్త విధానంతో షోడశోపచారాలు. ప్రతి ఉపచారంలో మొదట పురుషసూక్త మంత్రం, తరువాత శ్లోకం, తరువాత మూలమంత్రంతో సమర్పణ వస్తాయి. మూలమంత్రం పూర్తి పాఠం క్రింద ఉంది; ఉపచారాల్లో సంక్షిప్తంగా “ఓం నమో భగవతే … ధర్మశాస్త్రే స్వాహా” అని ఇవ్వబడింది.

శ్రీ హరిహరపుత్ర ధ్యానమ్ – నాలుగు ధ్యానాలు

పుష్పాక్షతలు దేవునికి సమర్పించి నమస్కరించవలెను

సత్త్వగుణ ధ్యానమ్ / శ్రీ జ్ఞానశాస్తా ధ్యానమ్

శాంతం శారదచంద్రకాంతిధవళం చంద్రాభిరామాననం
చంద్రార్కోపమకాంతకుండలధరం చంద్రావదాతాంశుకమ్ ।
వీణాం పుస్తకమక్షసూత్రవలయం వ్యాఖ్యానముద్రాం కరైః
బిభ్రాణం కలయే సదా హృది మహాశాస్తారమాసిద్ధయే ॥

రజోగుణ ధ్యానమ్ / శ్రీ సమ్మోహన శాస్తా ధ్యానమ్

తేజోమండలమధ్యగం త్రినయనం దివ్యాంబరాలంకృతం
దేవం పుష్పశరేక్షుకార్ముకలసన్మాణిక్యపాత్రాఽభయమ్ ।
బిభ్రాణం కరపంకజైర్మదగజస్కంధాదిరూఢం విభుం
శాస్తారం శరణం వ్రజామి సతతం త్రైలోక్యసమ్మోహనమ్ ॥

తమోగుణ ధ్యానమ్ / శ్రీ బాల శాస్తా ధ్యానమ్

కల్హారోజ్జ్వలనీలకుంతలభరం కాలాంబుదశ్యామలం
కర్పూరాకలితాభిరామవపుషం కాంతేందుబింబాననమ్ ।
శ్రీదండాంకుశపాశశూలవిలసత్పాణిం మదాంధద్విపా-
రూఢం శత్రువిమర్దనం హృది మహాశాస్తారమాద్యం భజే ॥

కిరాత శాస్తా ధ్యానమ్ / శ్రీ విశ్వ శాస్తా ధ్యానమ్

త్రిగుణితమణిపద్మం వజ్రమాణిక్యదండం
సితసుమశరపాశం చేక్షుకోదండకాండమ్ ।
మధుఘృతమధుపాత్రం బిభ్రతం హస్తపద్మైః
హరిహరసుతమీడే చక్రమంత్రాత్మమూర్తిమ్ ॥
శ్రీ హరిహరపుత్ర అయ్యప్పస్వామినే నమః । ధ్యాయామి ॥ స్వామియే శరణం అయ్యప్ప ॥

శ్రీ హరిహరపుత్ర మంత్రన్యాసః – న్యాసం

న్యాసం లేకుండా చేసిన మంత్ర క్రియలన్నీ నిష్ఫలమవుతాయి కాబట్టి, మంత్రోక్త ఫలం కొరకు, శరీరశుద్ధి కొరకు న్యాసం ఆచరించాలి.

శ్రీ మహాశాస్తృ సూక్తమ్ (యాజుషమ్)

ఓం ధాతా విధాతా పరమోత సందృక్ ప్రజాపతిః పరమేష్ఠీ విరాజా ।
స్తోమాశ్ఛందాగ్ంసి నివిదో మ ఆహురేతస్మై రాష్ట్రమభిసన్నమామ ॥
అభ్యావర్తధ్వముపమేత సాకమయగ్ం శాస్తాఽధిపతిర్వో అస్తు ।
అస్య విజ్ఞానమనుసగ్ంరభధ్వమిమం పశ్చాదను జీవాథ సర్వే ॥

ఈ మంత్రం ఉచ్చరించిన పిదప పుష్పాలు స్వామికి సమర్పించి శరణాలు చెప్పాలి. తరువాత ఈ న్యాస మంత్రాలు చదువుతూ ఆయా అంగాలను స్పృశించాలి.

అంగన్యాసః

  1. శిరసి — ఓం ధాతా విధాతా నమః
  2. లలాటే — పరమోత సందృక్ నమః
  3. ముఖే — ప్రజాపతిః పరమేష్ఠీ నమః
  4. దక్షిణనేత్రే — విరాజా నమః
  5. వామనేత్రే — స్తోమాశ్ఛందాగ్ంసి నమః
  6. కంఠే — నివిదో మ ఆహుః నమః
  7. దక్షిణాంసే — ఏతస్మై రాష్ట్రం నమః
  8. వామాంసే — అభిసన్నమామ నమః
  9. హృదయే — అభ్యావర్తధ్వం నమః
  10. నాభౌ — ఉపమేత సాకం నమః
  11. గుహ్యే — అయగ్ం శాస్తా నమః
  12. దక్షిణ ఊరౌ — అధిపతిః నమః
  13. వామ ఊరౌ — వో అస్తు నమః
  14. దక్షిణ జానునీ — అస్య విజ్ఞానం నమః
  15. వామ జానునీ — అనుసగ్ంరభధ్వం నమః
  16. దక్షిణ పాదే — ఇమం నమః
  17. వామ పాదే — పశ్చాత్ నమః
  18. దక్షిణ హస్తే — అనుజీవాథ నమః
  19. వామ హస్తే — సర్వే నమః

పృష్ఠే — ఓం ధాతా విధాతా పరమోత సందృక్ ప్రజాపతిః పరమేష్ఠీ విరాజా నమః ॥
పురస్తాత్ — స్తోమాశ్ఛందాగ్ంసి నివిదో మ ఆహురేతస్మై రాష్ట్రమభిసన్నమామ నమః ॥
సర్వాంగేషు — అభ్యావర్తధ్వముపమేత సాకమయగ్ం శాస్తాఽధిపతిర్వో అస్తు ।
అస్య విజ్ఞానమనుసగ్ంరభధ్వమిమం పశ్చాదను జీవాథ సర్వే నమః ॥

“పురస్తాత్” వద్ద రెండు చేతులతో స్వామికి దోసిలి యొగ్గాలి; “సర్వాంగేషు” వద్ద శిరస్సు మొదలు పాదాల వరకు స్పృశించాలి.

శ్రీ హరిహరపుత్ర గాయత్రీ మంత్రమ్

ఓం భూతనాథాయ విద్మహే భవపుత్రాయ ధీమహి ।
తన్నః శాస్తా ప్రచోదయాత్ ॥

శ్రీ శాస్తా గాయత్రీ మంత్రన్యాసః

  1. శిరసి — ఓం భూతనాథాయ నమః
  2. లలాటే — విద్మహే నమః
  3. ముఖే — భవపుత్రాయ నమః
  4. కంఠే — ధీమహి నమః
  5. నాభౌ — తన్నః నమః
  6. ఊర్వోః — శాస్తా నమః
  7. పాదయోః — ప్రచోదయాత్ నమః
  8. సర్వాంగేషు — ఓం భూతనాథాయ విద్మహే భవపుత్రాయ ధీమహి । తన్నః శాస్తా ప్రచోదయాత్ నమః

ఓం నమో భగవతే హరిహరపుత్రాయ ॥

ఋష్యాదిన్యాసః

అస్య శ్రీ హరిహరపుత్ర మహామంత్రస్య అర్ధనారీశ్వర ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీ హరిహరపుత్రో దేవతా ।
హ్రాం బీజం హ్రీం శక్తిః హ్రూం కీలకం శ్రీ హరిహరపుత్ర ప్రసాదసిద్ధ్యర్థే జపే (పూజాయాం చ) వినియోగః ॥

కరన్యాసః

  • హ్రాం — అంగుష్ఠాభ్యాం నమః
  • హ్రీం — తర్జనీభ్యాం నమః
  • హ్రూం — మధ్యమాభ్యాం నమః
  • హ్రైం — అనామికాభ్యాం నమః
  • హ్రౌం — కనిష్ఠికాభ్యాం నమః
  • హ్రః — కరతలకరపృష్ఠాభ్యాం నమః

హృదయాది న్యాసః / అంగన్యాసః

  • హ్రాం — హృదయాయ నమః
  • హ్రీం — శిరసే స్వాహా
  • హ్రూం — శిఖాయై వషట్
  • హ్రైం — కవచాయ హుమ్
  • హ్రౌం — నేత్రత్రయాయ వౌషట్
  • హ్రః — అస్త్రాయ ఫట్
  • భూర్భువస్సువరోమితి దిగ్బంధః

కరన్యాసంలో: బొటనవ్రేలుతో చూపుడు వ్రేలు, మధ్య వ్రేలు, ఉంగరపు వ్రేలు, చిటికెన వ్రేలు తాకాలి; చివర అరచేతులు, చేతి వెనుక భాగాలు తాకాలి. అంగన్యాసంలో హృదయం, శిరస్సు, శిఖ, శరీరం, కళ్ళు తాకి, చివర కుడిచేతిని శిరస్సు చుట్టూ తిప్పి ఎడమ అరచేతిపై తాకాలి; దిగ్బంధంలో వ్రేళ్ళతో చిటికె వేయాలి.

శ్రీ హరిహరపుత్ర ఇతి ధ్యానమ్ ॥

శ్రీ శాస్తా యంత్ర అష్టోత్తర శతనామ పూజా మంత్ర ధ్యానమ్

ఆశ్యామకోమలవిశాలతనుం విచిత్ర-
వాసోదధానమరుణోత్పలవామహస్తమ్ ।
ఉత్తుంగరత్నమకుటం కుటిలాగ్రకేశం
శాస్తారమిష్టవరదం ప్రణతోఽస్మి నిత్యమ్ ॥ స్వామియే శరణం అయ్యప్ప ॥

లమిత్యాది పంచపూజా – పంచభూతాల పూజ

ధ్యానం ముగిసిన పిదప పంచపూజలు చేయడం శ్రేష్ఠం. పంచభూతాలు – భూమి, ఆకాశం, వాయువు, అగ్ని, నీరు.

లం — పృథివ్యాత్మనే గంధం కల్పయామి ।
హం — ఆకాశాత్మనే పుష్పం కల్పయామి ।
యం — వాయ్వాత్మనే ధూపమాఘ్రాపయామి ।
రం — అగ్న్యాత్మనే దీపం దర్శయామి ।
వం — జలాత్మనే అమృతోపహారం నివేదయామి ।
సం — సర్వాత్మనే సర్వోపచారాన్ సమర్పయామి ॥ స్వామియే శరణం అయ్యప్ప ॥

క్రమంగా గంధం, పుష్పం, అగరువత్తి, దీపం చూపి, ఫలం నివేదన చేసి, చివర పుష్పాలు సమర్పించాలి.

మూలమంత్రమ్ (39 అక్షరాలు) – ఐదుసార్లు

ఓం నమో భగవతే హరిహరపుత్రాయ పుత్రలాభాయ శత్రునాశనాయ మదగజవాహనాయ ధర్మశాస్త్రే స్వాహా ॥ స్వామియే శరణం అయ్యప్ప ॥

 ప్రాణ ప్రతిష్ఠ

పుష్పాలు తీసుకొని నమస్కారం చేస్తూ ఈ మంత్రం ఉచ్చరించాలి.

ప్రాణప్రతిష్ఠా మహామంత్రః (పూర్వన్యాసః)

అస్య శ్రీ హరిహరపుత్రస్య ప్రాణప్రతిష్ఠా మహామంత్రస్య బ్రహ్మవిష్ణుమహేశ్వరా ఋషయః
ఋగ్యజుస్సామాథర్వాణి ఛందాంసి సకలజగత్సృష్టిస్థితిసంహారకారిణీ ప్రాణశక్తిః పరాదేవతా ।
ఆం బీజం హ్రీం శక్తిః క్రోం కీలకమ్ ।
సపరివారస్య శ్రీ హరిహరపుత్రస్య ప్రాణప్రతిష్ఠాపనార్థే జపే వినియోగః ॥ స్వామియే శరణం అయ్యప్ప ॥

ధ్యానమ్

రక్తాంభోధిస్థపోతోల్లసదరుణసరోజాధిరూఢా కరాబ్జైః
పాశం కోదండమిక్షూద్భవమళిగుణమప్యంకుశం పంచబాణాన్ ।
బిభ్రాణాఽసృక్కపాలం త్రినయనలసితా పీనవక్షోరుహాఢ్యా
దేవీ బాలార్కవర్ణా భవతు సుఖకరీ ప్రాణశక్తిః పరా నః ॥ స్వామియే శరణం అయ్యప్ప ॥

ప్రాణప్రతిష్ఠా మూలమంత్రమ్

ఆం హ్రీం క్రోం — క్రోం హ్రీం ఆం ।
య ర ల వ శ ష స హోం । హంసః సోఽహమ్ – సోఽహం హంసః ॥
శ్రీ హరిహరపుత్రస్య ప్రాణా ఇహ ప్రాణాః । జీవ ఇహ స్థితః ।
సకలేంద్రియాణి వాఙ్మనశ్చక్షుః శ్రోత్ర జిహ్వా ఘ్రాణ ప్రాణాపాన వ్యానోదాన సమానాః
ఇహైవాగత్య అస్మిన్ బింబే సుఖం చిరం తిష్ఠంతు స్వాహా ॥ స్వామియే శరణం అయ్యప్ప ॥

ప్రణవ మంత్రమ్

ఓం … ఓం … ఓం … (16 సార్లు)

స్వామివారికి షోడశ కళలు కల్పించుటకు ఓంకారాన్ని 16 పర్యాయాలు ఉచ్చరించాలి.

ప్రాణప్రతిష్ఠా మంత్రమ్

ఓం అసునీతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణమిహ నో ధేహి భోగమ్ ।
జ్యోక్పశ్యేమ సూర్యముచ్చరంతమనుమతే మృడయా నః స్వస్తి ॥
స్వామిన్ సర్వజగన్నాథ యావత్పూజావసానకమ్ ।
తావత్త్వం ప్రీతిభావేన పద్మేఽస్మిన్ బింబే సన్నిధిం కురు ॥
ఆవాహితో భవ । స్థాపితో భవ । సన్నిహితో భవ । సన్నిరుద్ధో భవ । అవకుంఠితో భవ ।
సుప్రీతో భవ । సుప్రసన్నో భవ । సుముఖో భవ । వరదో భవ ॥
స్వామిన్ ప్రసీద ప్రసీద । స్వాగతమస్తు ।
శ్రీ హరిహరపుత్రస్య సపరివారస్య ప్రాణాన్ ప్రతిష్ఠాపయామి ॥
ప్రాణశక్త్యై నమః । ఫలం నివేదయామి ॥ స్వామియే శరణం అయ్యప్ప ॥

పుష్పంతో స్వామివారిపై కుడిచేయి ఉంచి మంత్రం చెప్పి, పుష్పం సమర్పించి నమస్కరించాలి; పండ్లు నైవేద్యం చేయాలి.

ప్రాణప్రతిష్ఠ అంటే: సర్వాంతర్యామి అయిన భగవంతుని వేదమంత్రాలతో స్తోత్రం చేసి, మనం సరూపంగా అమర్చుకున్న విగ్రహం (లేక చిత్రపటం)లో వేంచేసి, తన అద్భుత శక్తితో పూజ ముగిసే వరకు ఉండవలెనని, మేము చేసే పూజలు అందుకోవలెనని భక్తితో వేడుకోవడం.

శ్రీ హరిహరపుత్ర (ధర్మశాస్తృ) పీఠపూజా – పీఠ దేవతల పూజ

పుష్పములు దేవునిపై వేయవలెను

  • గుం — గురుభ్యో నమః
  • గం — గణపతయే నమః
  • క్షం — క్షేత్రపాలాయ నమః
  • సం — సరస్వత్యై నమః
  • పం — పరమాత్మనే నమః
  • ఓం ఆధారశక్త్యై నమః
  • ఓం మూలప్రకృత్యై నమః
  • ఓం ఆదికూర్మాయ నమః
  • ఓం ఆదివరాహాయ నమః
  • ఓం అనంతాయ నమః
  • ఓం పృథివ్యై నమః
  • ఓం రత్నమండపాయ నమః
  • ఓం రత్నవేదికాయై నమః
  • ఓం స్వర్ణస్తంభాయ నమః
  • ఓం శ్వేతచ్ఛత్రాయ నమః
  • ఓం కల్పకవృక్షాయ నమః
  • ఓం సితచామరాభ్యాం నమః

శ్రీ పూర్ణా పుష్కలాంబా సమేత శ్రీ హరిహరపుత్ర యోగపీఠాసనాయ నమః ।
సమస్తోపచారాన్ సమర్పయామి ॥ స్వామియే శరణం అయ్యప్ప ॥

 ధ్యానం

ధ్యాయేన్నీలాంబరధరం నీలమేఘనిభం ప్రభుమ్ ।
చతుర్భుజం త్రినయనం శాస్తారం సర్వసిద్ధయే ॥
ఏహ్యేహి పుష్కలాకాంత పూర్ణే శామర వందిత ।
మయా కృతాం సపర్యాం త్వం సంగృహ్య వరదో భవ ॥
ఓం శ్రీ హరిహరపుత్ర అయ్యప్పస్వామినే నమః । ధ్యాయామి ॥ స్వామియే శరణం అయ్యప్ప ॥

పుష్పాక్షతలు దేవునికి సమర్పించి నమస్కరించవలెను

శ్రీ పురుషసూక్త విధానేన పూజా ప్రారంభః – పురుషసూక్తంతో షోడశోపచారాలు

ఆవాహనమ్  – దేవతను ఆహ్వానించుట

ఘంటానాదం చేస్తూ ఈ మంత్రాలు చదువుతూ స్వామివారిని ఆహ్వానించాలి

సహస్రశీర్షా పురుషః । సహస్రాక్షః సహస్రపాత్ ।
స భూమిం విశ్వతో వృత్వా । అత్యతిష్ఠద్దశాంగులమ్ ॥

ధ్యాయేదుమాపతి రమాపతి భాగ్యపుత్రం
వేత్రోజ్జ్వలత్కరతలం భసితాభిరామమ్ ।
విశ్వైకవశ్యవపుషం మృగయావినోదం
వాంఛానురూపఫలదం వరభూతనాథమ్ ॥

ఓం నమో భగవతే హరిహరపుత్రాయ పుత్రలాభాయ శత్రునాశనాయ మదగజవాహనాయ ధర్మశాస్త్రే స్వాహా ॥

ఓం భూర్భువస్సువరోం అస్మిన్ బింబే సాంగం సాయుధం సపరివారం
శ్రీ పూర్ణా పుష్కలాంబా సమేత శ్రీ హరిహరపుత్ర అయ్యప్పస్వామినే నమః । ఆవాహయామి ॥
ప్రాణప్రతిష్ఠాం కృత్వా త్రిమధురం (ఫలం) నివేద్య ॥ స్వామియే శరణం అయ్యప్ప ॥

పండ్లు నైవేద్యం చేసి, స్వామివారికి పుష్పాలు సమర్పించి నమస్కరించాలి

 ఆసన సమర్పణ

పురుష ఏవేదగ్ం సర్వమ్ । యద్భూతం యచ్చ భవ్యమ్ ।
ఉతామృతత్వస్యేశానః । యదన్నేనాతిరోహతి ॥

దివ్యం రత్నపరిక్షిప్తం స్వర్ణసింహాసనం శుభమ్ ।
భక్త్యా దదామి దేవేశ ధర్మశాస్తా నమోఽస్తు తే ॥

ఓం నమో భగవతే … ధర్మశాస్త్రే స్వాహా । సపరివారాయ … నమః ।
సువర్ణ రత్న ఖచిత సింహాసనం సమర్పయామి ॥ సింహాసనార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి ॥ స్వామియే శరణం అయ్యప్ప ॥

పాద్యమ్ – పాదప్రక్షాళనకు జలం

ఏతావానస్య మహిమా । అతో జ్యాయాగ్ంశ్చ పూరుషః ।
పాదోఽస్య విశ్వా భూతాని । త్రిపాదస్యామృతం దివి ॥

ఇదం పాద్యం మయానీతం స్వర్ణపాత్రసముద్ధృతమ్ ।
సంగృహ్య తుష్టహృదయః పాదప్రక్షాళనం కురు ॥

ఓం నమో భగవతే … ధర్మశాస్త్రే స్వాహా । సపరివారాయ … నమః ।
పాదయోః పాద్యం సమర్పయామి ॥ స్వామియే శరణం అయ్యప్ప ॥

శుద్ధోదకాన్ని పుష్పంతో స్వామివారిపై చల్లాలి, లేక ఉద్ధరిణి తీర్థంతో స్వామివారి పాదాలు కడగాలి.

అర్ఘ్యమ్ – హస్తప్రక్షాళనకు జలం

దేవునిపై పుష్పంతో నీళ్లు చల్లవలెను

త్రిపాదూర్ధ్వ ఉదైత్పురుషః । పాదోఽస్యేహాఽభవాత్పునః ।
తతో విష్వఙ్వ్యక్రామత్ । సాశనానశనే అభి ॥

అర్ఘ్యం గృహాణ భూతాత్మన్ అష్టద్రవ్యసుపూరితమ్ ।
నమోఽస్తు దేవదేవేశ పూర్ణకామం కురుష్వ మామ్ ॥

ఓం నమో భగవతే … ధర్మశాస్త్రే స్వాహా । సపరివారాయ … నమః ।
హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ॥ స్వామియే శరణం అయ్యప్ప ॥

ఆచమనీయమ్ –  ఆచమనానికి జలం

దేవునిపై పుష్పంతో నీళ్లు చల్లవలెను

తస్మాద్విరాడజాయత । విరాజో అధి పూరుషః ।
స జాతో అత్యరిచ్యత । పశ్చాద్భూమిమథో పురః ॥

ఏలాలవంగతక్కోలజాతీకర్పూరవాసితమ్ ।
ఇదమాచమనీయం తే దదామి వననాయక ॥

ఓం నమో భగవతే … ధర్మశాస్త్రే స్వాహా । సపరివారాయ … నమః ।
ముఖే ఆచమనీయం సమర్పయామి ॥ స్వామియే శరణం అయ్యప్ప ॥

మధుపర్కమ్ – మధుపర్క సమర్పణ

పాలు, తేనె కలిపిన పానీయాన్ని పుష్పంతో చల్లవలెను

యత్పురుషేణ హవిషా । దేవా యజ్ఞమతన్వత ।
వసంతో అస్యాసీదాజ్యమ్ । గ్రీష్మ ఇధ్మశ్శరద్ధవిః ॥

దధిక్షీరసమాయుక్తం శర్కరామధుసంయుతమ్ ।
మధుపర్కం మయానీతం భూతనాథ గృహాణ భోః ॥

ఓం నమో భగవతే … ధర్మశాస్త్రే స్వాహా । సపరివారాయ … నమః ।
మధుపర్కం సమర్పయామి ॥ స్వామియే శరణం అయ్యప్ప ॥

 పంచామృత అభిషేకం

ఆవుపాలు, పెరుగు, నెయ్యి, తేనె, శర్కర – ఈ ఐదింటిని కలిపిన పంచామృతాన్ని పుష్పంతో దేవునిపై చల్లవలెను

సప్తాస్యాసన్ పరిధయః । త్రిస్సప్త సమిధః కృతాః ।
దేవా యద్యజ్ఞం తన్వానాః । అబధ్నన్ పురుషం పశుమ్ ॥

దివ్యపంచామృతమిదం ఫలక్షీరాజ్యమిశ్రితమ్ ।
శర్కరామధుసంయుక్తం స్నానార్థం ప్రతిగృహ్యతామ్ ॥

ఓం నమో భగవతే … ధర్మశాస్త్రే స్వాహా । సపరివారాయ … నమః ।
పంచామృతస్నానం సమర్పయామి ॥ స్వామియే శరణం అయ్యప్ప ॥

తీర్థోదకైః కాంచనకుంభసంస్థైః సువాసితైర్దివ్యసుమంత్రపూతైః ।
మయార్చితం స్నానవిధిం గృహాణ పాదాబ్జనిష్ఠ్యూతనదీప్రవాహ ॥
పంచామృతస్నానానంతరం శుద్ధోదకస్నానం సమర్పయామి ॥

అయ్యప్పస్వామి పంచామృత అభిషేకం — వేద మంత్రాలతోపాలు, పెరుగు, నెయ్యి, తేనె, శర్కర, ఫలోదకం, విభూతి, చందనం — ఒక్కొక్క ద్రవ్యానికి వేదమంత్రం; మధుర పంచామృతం తయారీ.

తరువాత పంచామృత అభిషేకం – పాలు, పెరుగు, నెయ్యి, తేనె, శర్కర, ఫలోదకం, విభూతి, చందనం – ఒక్కొక్క వేదమంత్రంతో; ఆపై అలంకార పూజ, అష్టోత్తరం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here