గురువు ప్రాముఖ్యత
వేదమంత్రాలు, శ్లోకాలు నేర్చుకోవాలన్నా సద్గురువు కృప లేనిదే సాధ్యం కాదు. భగవంతునికి దగ్గరగా మనలను చేర్చే సామర్థ్యం గురువుకే ఉంది. అందుకే దైవజ్ఞులు గురువును బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా, పరబ్రహ్మగా స్తుతించారు. ఎంతటి మహత్తరమైన సాధనైనా గురుస్మరణ లేనిదే నిష్ప్రయోజనం.
గురుస్వామి
- శబరిమల యాత్రను నిర్వహించే స్వామిని “గురుస్వామి” అంటారు.
- అందరికీ ఆది గురువు ఆ శబరినాథుడే. కాబట్టి యాత్ర నిర్వహించే గురుస్వాములందరూ సాక్షాత్ అయ్యప్ప స్వరూపులే.
- గురువు గారి తోడు లేకుండా శబరి యాత్ర ఉండదు.
శిష్యుని బాధ్యత
- శిష్యులు గురుస్వాముల ఆనతిని శిరసావహించి నడుచుకోవడమే గురువులకు గురువైన శ్రీ ధర్మశాస్తా వారికి సంతృప్తిని కలిగిస్తుంది.
- గురుస్వామి ఆదేశాలను తప్పక ఆచరించేవారి శబరిమల యాత్ర సుఖమయమవుతుంది.
- గురుస్వామి ఆజ్ఞను వేదవచనంగా స్వీకరించి ఆచరించాలి.
గురునింద
ఎట్టి పరిస్థితిలోనూ గురువులను నిందించరాదు. గురునింద మహాపచారం; దానికి నివృత్తి లేదని శాస్త్రం చెబుతుంది.
శ్రీ గురు స్తోత్రము (సద్గురు పాదుకా ద్వాదశి)
శ్రీ శంకరాచార్య విరచితం , ప్రాతఃకాలం గురుపాదుకలను మనసులో ధ్యానించే పన్నెండు శ్లోకాలు, గురు గాయత్రి, శంకరాచార్య గాయత్రి.
గురుదక్షిణ — ఏడు సమయాలు
మాలాధారణ నుండి మాలా విసర్జన వరకు గురుస్వామి వారికి దక్షిణ సమర్పించే ఏడు సందర్భాలు.
గురు సమర్పణ
18వ మాలాధారణ సందర్భంగా శిష్యుడు డా. సువర్ణ కుమార్, తన గురుస్వామి బ్రహ్మశ్రీ డి.వి.ఎన్. మూర్తి గురుస్వామి గారి పాదపద్మాలకు గురుదక్షిణగా సమర్పిస్తున్న వెబ్‌సైట్.


