పూర్తి వేదోక్త పూజ (అయ్యప్పస్వామి పూజా విధానం) చేయలేని రోజుల్లో, లేదా కొత్తగా మాల వేసుకున్న కన్నె స్వాములు, ఈ సులభ పూజను ఉదయం, సాయంత్రం ఒకేలా చేసుకోవచ్చు. “సమర్పయామి” అంటే “సమర్పిస్తున్నాను”.
పూజా సామగ్రి – ముందుగా సిద్ధం చేసుకోండి
- గణపతి, శ్రీ లక్ష్మీదేవి, అయ్యప్పస్వామి పటాలు / విగ్రహాలు
- పంచపాత్ర, ఉద్ధరిణి — ఆచమనానికి
- చిన్న నీళ్ళ చెంబు — సంకల్పం, ఉపచారాలకు; నీరు విడవడానికి పళ్ళెం
- విడి పువ్వులు (పూజలో పలుమార్లు కావాలి)
- అక్షతలు — పసుపు కలిపిన బియ్యం
- గంధం — చిన్న గిన్నెలో; మీ బొట్టుకు, మాలకు కూడా
- పత్తి — వస్త్రం, యజ్ఞోపవీతానికి
- 2 అగరుబత్తీలు, స్టాండ్, అగ్గిపెట్టె
- నూనె లేదా నెయ్యి దీపాలు, వత్తులు
- పండు — నైవేద్యానికి; తమలపాకులు (ఐచ్ఛికం)
- కర్పూరం, హారతి పళ్ళెం, గంట (ఎడమ చేతితో)
- విసనకర్ర — వింజామరానికి
ఉపచారాలు ముగ్గురు దేవతలకు ఈ క్రమంలోనే సమర్పించాలి: 1. ఓం శ్రీ గణేశాయ నమః 2. ఓం శ్రీ లక్ష్మీదేవ్యై నమః 3. ఓం శ్రీ అయ్యప్పస్వామినే నమః
పూజా విధానం
1. గంధం బొట్టు
సిద్ధంగా ఉంచుకోండి: గంధం
మీ నుదుటన గంధం బొట్టు పెట్టుకోండి. తరువాత మీరు ధరించిన అయ్యప్ప దీక్షా మాలకు కూడా గంధం పెట్టండి.
2. ప్రార్థన
సిద్ధంగా ఉంచుకోండి: ఒక పువ్వు లేదా అక్షతలు
చేతుల్లో పువ్వు/అక్షతలు పట్టుకొని చదవండి; తరువాత దేవతలకు సమర్పించండి.
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ ।
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ॥
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః ।
గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః ॥
3. ఆచమనం
సిద్ధంగా ఉంచుకోండి: నీళ్ళతో పంచపాత్ర, ఉద్ధరిణి
ఉద్ధరిణితో కొద్దిగా నీరు కుడి అరచేతిలో పోసుకొని, ఒక్కో నామానికి ఒకసారి చొప్పున మూడుసార్లు త్రాగండి. తరువాత చేయి కడుక్కోండి.
ఓం కేశవాయ నమః
ఓం నారాయణాయ నమః
ఓం మాధవాయ నమః
4. భూశుద్ధి
సిద్ధంగా ఉంచుకోండి: అక్షతలు
శ్లోకం చదివి, కొన్ని అక్షతలను మీ వెనుక వైపు చల్లండి.
ఉత్తిష్ఠంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ।
ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ॥
5. ప్రాణాయామం
ఎడమ వైపు ఉంగరపు వ్రేలు, కుడి వైపు బొటనవ్రేలు ఉంచి ముక్కు మూసి ఈ మంత్రం చెప్పండి.
ఓం భూః । ఓం భువః । ఓగ్ం సువః । ఓం మహః । ఓం జనః । ఓం తపః । ఓగ్ం సత్యమ్ ।
ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి । ధియో యో నః ప్రచోదయాత్ ॥
ఓమాపో జ్యోతీ రసోఽమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్ ॥
6. సంకల్పం
సిద్ధంగా ఉంచుకోండి: నీళ్ళ చెంబు, ఒక పువ్వు
చెంబులో పువ్వు వేసి దానిపై కుడిచేయి ఉంచి చదవండి. ఖాళీల్లో మీ గోత్రం, పేరు చెప్పండి. తరువాత ఆ నీటిని పూజా ద్రవ్యాలపై చల్లండి.
…… గోత్రస్య …… నామధేయస్య
యావచ్ఛక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే ॥
7. ఆవాహనం
సిద్ధంగా ఉంచుకోండి: పువ్వులు లేదా అక్షతలు
ముగ్గురు దేవతలకు క్రమంగా ఈ మంత్రం చెప్పి సమర్పించండి.
ఓం శ్రీ గణేశాయ నమః । ఆవాహయామి స్థాపయామి పూజయామి ॥
ఓం శ్రీ లక్ష్మీదేవ్యై నమః । ఆవాహయామి స్థాపయామి పూజయామి ॥
ఓం శ్రీ అయ్యప్పస్వామినే నమః । ఆవాహయామి స్థాపయామి పూజయామి ॥
8. ధ్యానం
సిద్ధంగా ఉంచుకోండి: అక్షతలు లేదా పువ్వులు
ముగ్గురు దేవతలకు క్రమంగా ఈ మంత్రం చెప్పి సమర్పించండి.
ఓం శ్రీ గణేశాయ నమః । ధ్యానం సమర్పయామి ॥
ఓం శ్రీ లక్ష్మీదేవ్యై నమః । ధ్యానం సమర్పయామి ॥
ఓం శ్రీ అయ్యప్పస్వామినే నమః । ధ్యానం సమర్పయామి ॥
9. పాద్యం · అర్ఘ్యం · ఆచమనీయం · స్నానం
సిద్ధంగా ఉంచుకోండి: నీళ్ళ చెంబు, ఉద్ధరిణి, పళ్ళెం
ఒక్కో ఉపచారానికి ఉద్ధరిణితో కొద్దిగా నీరు తీసి ఒక్కో దేవతకు చూపి, మంత్రం చెప్పి పళ్ళెంలో విడవండి. ముగ్గురు దేవతలకూ పూర్తయ్యాకే తరువాతి ఉపచారానికి వెళ్ళండి — పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, స్నానం.
ఓం శ్రీ గణేశాయ నమః । పాద్యం సమర్పయామి ॥
ఓం శ్రీ లక్ష్మీదేవ్యై నమః । పాద్యం సమర్పయామి ॥
ఓం శ్రీ అయ్యప్పస్వామినే నమః । పాద్యం సమర్పయామి ॥
ఓం శ్రీ గణేశాయ నమః । అర్ఘ్యం సమర్పయామి ॥
ఓం శ్రీ లక్ష్మీదేవ్యై నమః । అర్ఘ్యం సమర్పయామి ॥
ఓం శ్రీ అయ్యప్పస్వామినే నమః । అర్ఘ్యం సమర్పయామి ॥
ఓం శ్రీ గణేశాయ నమః । ఆచమనీయం సమర్పయామి ॥
ఓం శ్రీ లక్ష్మీదేవ్యై నమః । ఆచమనీయం సమర్పయామి ॥
ఓం శ్రీ అయ్యప్పస్వామినే నమః । ఆచమనీయం సమర్పయామి ॥
ఓం శ్రీ గణేశాయ నమః । స్నానం సమర్పయామి ॥
ఓం శ్రీ లక్ష్మీదేవ్యై నమః । స్నానం సమర్పయామి ॥
ఓం శ్రీ అయ్యప్పస్వామినే నమః । స్నానం సమర్పయామి ॥
10. వస్త్రం
సిద్ధంగా ఉంచుకోండి: పత్తి
ముగ్గురు దేవతలకు క్రమంగా ఈ మంత్రం చెప్పి సమర్పించండి.
ఓం శ్రీ గణేశాయ నమః । వస్త్రం సమర్పయామి ॥
ఓం శ్రీ లక్ష్మీదేవ్యై నమః । వస్త్రం సమర్పయామి ॥
ఓం శ్రీ అయ్యప్పస్వామినే నమః । వస్త్రం సమర్పయామి ॥
11. యజ్ఞోపవీతం
సిద్ధంగా ఉంచుకోండి: పత్తి
గణపతికి, అయ్యప్పస్వామికి మాత్రమే సమర్పించండి.
ఓం శ్రీ గణేశాయ నమః । యజ్ఞోపవీతం సమర్పయామి ॥
ఓం శ్రీ అయ్యప్పస్వామినే నమః । యజ్ఞోపవీతం సమర్పయామి ॥
12. గంధం
సిద్ధంగా ఉంచుకోండి: గంధం, పువ్వులు
పువ్వును గంధంలో ముంచి ఒక్కో దేవతకు సమర్పించండి.
ఓం శ్రీ గణేశాయ నమః । గంధం సమర్పయామి ॥
ఓం శ్రీ లక్ష్మీదేవ్యై నమః । గంధం సమర్పయామి ॥
ఓం శ్రీ అయ్యప్పస్వామినే నమః । గంధం సమర్పయామి ॥
13. అక్షతలు
సిద్ధంగా ఉంచుకోండి: అక్షతలు
ముగ్గురు దేవతలకు క్రమంగా ఈ మంత్రం చెప్పి సమర్పించండి.
ఓం శ్రీ గణేశాయ నమః । అక్షతాన్ సమర్పయామి ॥
ఓం శ్రీ లక్ష్మీదేవ్యై నమః । అక్షతాన్ సమర్పయామి ॥
ఓం శ్రీ అయ్యప్పస్వామినే నమః । అక్షతాన్ సమర్పయామి ॥
14. పుష్పం
సిద్ధంగా ఉంచుకోండి: పువ్వులు
ముగ్గురు దేవతలకు క్రమంగా ఈ మంత్రం చెప్పి సమర్పించండి.
ఓం శ్రీ గణేశాయ నమః । పుష్పాణి సమర్పయామి ॥
ఓం శ్రీ లక్ష్మీదేవ్యై నమః । పుష్పాణి సమర్పయామి ॥
ఓం శ్రీ అయ్యప్పస్వామినే నమః । పుష్పాణి సమర్పయామి ॥
15. ఆభరణం
సిద్ధంగా ఉంచుకోండి: పువ్వులు
ఆభరణాలకు బదులుగా ఒక్కో దేవతకు ఒక పువ్వు సమర్పించండి.
ఓం శ్రీ గణేశాయ నమః । ఆభరణం సమర్పయామి ॥
ఓం శ్రీ లక్ష్మీదేవ్యై నమః । ఆభరణం సమర్పయామి ॥
ఓం శ్రీ అయ్యప్పస్వామినే నమః । ఆభరణం సమర్పయామి ॥
16. అష్టోత్తరం, శరణు ఘోష
సిద్ధంగా ఉంచుకోండి: పువ్వులు లేదా అక్షతలు (ఐచ్ఛికం)
ఈ క్రమంలో చదవండి; ప్రతి నామానికి కొద్దిగా అక్షతలు లేదా పువ్వు వేయవచ్చు. తరువాత 17వ దశకు రండి: శ్రీ గణేశ అష్టోత్తరం → శ్రీ లక్ష్మీ అష్టోత్తరం → శ్రీ ధర్మశాస్తా అష్టోత్తరం → అయ్యప్ప శరణు ఘోష.
17. ధూపం
సిద్ధంగా ఉంచుకోండి: 2 అగరుబత్తీలు, అగ్గిపెట్టె
రెండు అగరుబత్తీలు వెలిగించి ముగ్గురు దేవతల ముందు త్రిప్పండి.
ఓం శ్రీ గణేశాయ నమః । ధూపమాఘ్రాపయామి ॥
ఓం శ్రీ లక్ష్మీదేవ్యై నమః । ధూపమాఘ్రాపయామి ॥
ఓం శ్రీ అయ్యప్పస్వామినే నమః । ధూపమాఘ్రాపయామి ॥
18. దీపం
సిద్ధంగా ఉంచుకోండి: నూనె లేదా నెయ్యి దీపాలు, వత్తులు
దీపాలు వెలిగిస్తూ చదవండి; చివరలో “దీపం సమర్పయామి” అనండి.
ఓం అసతో మా సద్గమయ ।
తమసో మా జ్యోతిర్గమయ ।
మృత్యోర్మా అమృతం గమయ ।
ఓం శాంతిః శాంతిః శాంతిః ॥
దీపం సమర్పయామి ॥
19. నైవేద్యం
సిద్ధంగా ఉంచుకోండి: ఒక పండు, ఉద్ధరిణెడు నీరు
పండును దేవతల ముందు ఉంచి దానిపై ఒక చుక్క నీరు చల్లండి.
నైవేద్యం సమర్పయామి ॥
20. తాంబూలం (ఐచ్ఛికం)
సిద్ధంగా ఉంచుకోండి: తమలపాకులు, పువ్వు, నీరు
తమలపాకులు ఉంటే, పువ్వుతో వాటిపై నీరు చల్లి దేవతలకు చూపించండి.
తాంబూలం సమర్పయామి ॥
21. నీరాజనం (హారతి)
సిద్ధంగా ఉంచుకోండి: కర్పూరం, హారతి పళ్ళెం, గంట, పువ్వు, నీరు
1) కర్పూరం వెలిగించి, ఎడమ చేతితో గంట కొడుతూ దేవతల ముందు మూడుసార్లు హారతి త్రిప్పండి. 2) మాలను ఎడమ చేతిలో పట్టుకొని కుడి చేతితో మాలకు హారతి ఇవ్వండి. 3) పువ్వును నీటిలో ముంచి హారతి పళ్ళెంపై చల్లండి. 4) రెండు చేతులతో హారతిని కళ్ళకు అద్దుకోండి. హారతి సమయంలో హరివరాసనం పాడవచ్చు.
నీరాజనం సమర్పయామి ॥
22. ఆత్మప్రదక్షిణ నమస్కారం
సిద్ధంగా ఉంచుకోండి: అక్షతలు
అక్షతలు పట్టుకొని నిలుచున్న చోటే మూడుసార్లు తిరిగి, స్వామి పాదాల వద్ద అక్షతలు సమర్పించండి.
ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి ॥
23. వింజామరం
సిద్ధంగా ఉంచుకోండి: విసనకర్ర
దేవతలకు మెల్లగా వీచండి.
చామరం సమర్పయామి ॥
24. క్షమాపణ
చెంపలు మెల్లగా తట్టుకుంటూ, పూజలో జరిగిన పొరపాట్లను క్షమించమని స్వామిని ప్రార్థించండి.
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన ।
యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే ॥
25. సమర్పణం
సిద్ధంగా ఉంచుకోండి: అక్షతలు, ఉద్ధరిణెడు నీరు, పళ్ళెం
కుడి చేతిలో అక్షతలు పట్టుకోండి. ఎడమ చేతితో ఉద్ధరిణెడు నీరు కుడి అరచేతిలో పోసి, మంత్రం చెప్పి నీటిని, అక్షతలను పళ్ళెంలో విడవండి.
…… నామధేయస్య షోడశోపచార పూజాం సమర్పయామి ॥
చివరగా తల వంచి స్వామికి నమస్కరించండి. మీ ప్రార్థనలు చెప్పుకొని, ఆయన ఇచ్చిన ప్రతిదానికీ కృతజ్ఞతలు తెలుపుకోండి.
స్వామియే శరణం అయ్యప్ప!


