కలశారాధనం

0

కలశాన్ని సిద్ధం చేసే విధానం, కలశ శ్లోకాలు, జల మంత్రం, గంగాది నదుల ఆవాహన, పూజా ద్రవ్యాల ప్రోక్షణ.

ఘంటానాదం కృత్వా కలశపూజాం కుర్యాత్ ।
కలశం పుష్పగంధాక్షతైరభ్యర్చ్య ॥

ఘంట మ్రోగించి, ఆచమనం చేసిన పాత్ర కాకుండా వేరే కలశంలో ఉదకం పోసి, గంధ పుష్ప అక్షతలు వేసి, కలశానికి గంధం పూసి, కుంకుమ బొట్లు పెట్టి, ఎడమచేతిలో పాత్రను ఉంచుకొని కుడిచేతితో మూసి ఈ శ్లోకాలు చదవాలి.

కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రః సమాశ్రితః ।
మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణాః స్మృతాః ॥

కుక్షౌ తు సాగరాః సర్వే సప్తద్వీపా వసుంధరా ।
ఋగ్వేదోఽథ యజుర్వేదః సామవేదో హ్యథర్వణః ॥
అంగైశ్చ సహితాః సర్వే కలశాంబు సమాశ్రితాః ॥

జలమంత్రమ్ 

ఈ జలమంత్రం చదువుతూ కలశంలోని తీర్థాన్ని పుష్పంతో గాని తమలపాకుతో గాని కలపాలి.

ఆకలశేషు ధావతి పవిత్రే పరిషిచ్యతే । ఉక్థైర్యజ్ఞేషు వర్ధతే ॥
ఆపో వా ఇదగ్ం సర్వం విశ్వా భూతాన్యాపః ప్రాణా వా ఆపః పశవ ఆపోఽన్నమాపోఽమృతమాపః
సమ్రాడాపో విరాడాపః స్వరాడాపశ్ఛందాగ్ంస్యాపో జ్యోతీగ్ంష్యాపో యజూగ్ంష్యాపః
సత్యమాపః సర్వా దేవతా ఆపో భూర్భువస్సువరాప ఓమ్ ॥

గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి ।
నర్మదే సింధు కావేరి జలేఽస్మిన్ సన్నిధిం కురు ॥

కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమీ ।
భాగీరథీతి విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః ॥

ఆయాంతు మమ దురితక్షయకారకాః ॥
శ్రీ మహాగణపతి పూజార్థం (శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యస్వామి దేవతా పూజార్థం)
శ్రీ మహాలక్ష్మీ సమేత శ్రీ హరిహరపుత్ర అయ్యప్పస్వామి దేవతా పూజార్థం
హ్రీం హ్రాం ఫట్ ఇతి శుద్ధోదకేన దేవమాత్మానం చ పూజాద్రవ్యాణి సంప్రోక్ష్య ॥

పై శ్లోకాలు చదివిన పిదప కలశంలోని శుద్ధోదకాన్ని పుష్పంతో దేవునిపై, తనపై, పూజా ద్రవ్యాలపై చల్లాలి.

తరువాత విఘ్నేశ్వర పూజ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here