పసుపుతో గణపతిని తయారుచేసి, కుంకుమ బొట్లు పెట్టి, తమలపాకులో ఉంచాలి. ఒక పళ్ళెంలో బియ్యం పోసి, ఆ బియ్యంలో తమలపాకుతో సహా “పసుపు గణపతి”ని ఉంచాలి. తమలపాకు చివర తూర్పు వైపుకు గాని ఉత్తరం వైపుకు గాని ఉండేటట్లు ఉంచి పూజ చేయాలి. ప్రతి ఉపచారంలో గణపతి మూలమంత్రం, గణేశ గాయత్రి చెప్పాలి . పూర్తి పాఠం ఆవాహనం వద్ద ఉంది; తరువాతి ఉపచారాల్లో సంక్షిప్తంగా “ఓం శ్రీం హ్రీం … ప్రచోదయాత్” అని ఇవ్వబడింది.
ప్రాణప్రతిష్ఠ
పుష్పం తీసుకొని దేవునిపై ఉంచుతూ మంత్రం చదివి పుష్పం సమర్పించి నమస్కరించవలెను
ఓం అసునీతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణమిహ నో ధేహి భోగమ్ ।
జ్యోక్పశ్యేమ సూర్యముచ్చరంతమనుమతే మృడయా నః స్వస్తి ॥
అమృతం వై ప్రాణా అమృతమాపః ప్రాణానేవ యథాస్థానముపహ్వయతే ॥
స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు ॥
శ్రీ మహాగణాధిపతయే నమః ప్రాణప్రతిష్ఠాపన ముహూర్తః సుముహూర్తోఽస్తు ॥
ప్రాణప్రతిష్ఠాపనానంతరం ఫలం నివేదయామి ॥
ధ్యానం
ఓం గణానాం త్వా గణపతిగ్ం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమమ్ ।
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆ నః శృణ్వన్నూతిభిస్సీద సాదనమ్ ॥
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః । ధ్యాయామి ॥
పుష్పాక్షతలు దేవునికి సమర్పించి నమస్కరించవలెను
ఆవాహనమ్ – దేవతను ఆహ్వానించుట
ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా ॥
ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి । తన్నో దంతిః ప్రచోదయాత్ ॥
అత్రాగచ్ఛ జగద్వంద్య సురరాజార్చితేశ్వర ।
అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భసముద్భవ ॥
ఓం భూర్భువస్సువరోమ్ । అస్మిన్ బింబే సాంగం సాయుధం సపరివారం శ్రీ మహాగణాధిపతిం ఆవాహయామి ॥
దేవునిపై పుష్పాక్షతలు వేయవలెను
ఆసనమ్ – ఆసన సమర్పణ
మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితమ్ ।
రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్ ॥
ఓం శ్రీం హ్రీం … స్వాహా ।
ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి । తన్నో దంతిః ప్రచోదయాత్ ॥
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః । సువర్ణ రత్న ఖచిత సింహాసనం సమర్పయామి ॥ సింహాసనార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి ॥
పాద్యమ్ – పాదప్రక్షాళనకు జలం
గజవక్త్ర నమస్తేఽస్తు సర్వాభీష్టప్రదాయక ।
భక్త్యా పాద్యం మయా దత్తం గృహాణ ద్విరదానన ॥
ఓం శ్రీం హ్రీం … స్వాహా ।
ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి । తన్నో దంతిః ప్రచోదయాత్ ॥
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః । పాదయోః పాద్యం సమర్పయామి ॥
దేవునిపై పుష్పంతో నీళ్లు చల్లవలెను
అర్ఘ్యమ్ – హస్తప్రక్షాళనకు జలం
గౌరీపుత్ర నమస్తేఽస్తు శంకరస్య ప్రియనందన ।
గృహాణార్ఘ్యం మయా దత్తం గంధపుష్పాక్షతైర్యుతమ్ ॥
ఓం శ్రీం హ్రీం … స్వాహా ।
ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి । తన్నో దంతిః ప్రచోదయాత్ ॥
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః । హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ॥
దేవునిపై పుష్పంతో నీళ్లు చల్లవలెను
ఆచమనీయమ్ – ఆచమనానికి జలం
అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణవరపూజిత ।
గృహాణాచమనం దేవ తుభ్యం దత్తం మయా ప్రభో ॥
ఓం శ్రీం హ్రీం … స్వాహా ।
ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి । తన్నో దంతిః ప్రచోదయాత్ ॥
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః । ముఖే ఆచమనీయం సమర్పయామి ॥
దేవునిపై పుష్పంతో నీళ్లు చల్లవలెను
మధుపర్కమ్ – మధుపర్క సమర్పణ
దధిక్షీరసమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితమ్ ।
మధుపర్కం గృహాణేదం గజవక్త్ర నమోఽస్తు తే ॥
ఓం శ్రీం హ్రీం … స్వాహా ।
ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి । తన్నో దంతిః ప్రచోదయాత్ ॥
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః । మధుపర్కం సమర్పయామి ॥
పాలు, తేనె కలిపిన పానీయాన్ని పుష్పంతో చల్లవలెను
పంచామృత స్నానమ్ – పంచామృత అభిషేకం
స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక ।
అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణగణపూజిత ॥
ఓం శ్రీం హ్రీం … స్వాహా ।
ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి । తన్నో దంతిః ప్రచోదయాత్ ॥
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః । పంచామృతస్నానం సమర్పయామి ॥
ఆవుపాలు, పెరుగు, నెయ్యి, తేనె, శర్కర – ఈ ఐదింటిని కలిపిన పంచామృతాన్ని పుష్పంతో దేవునిపై చల్లవలెను
శుద్ధోదక స్నానమ్ – శుద్ధ జలంతో స్నానం
ఘంటానాదం చేస్తూ కలశంలోని శుద్ధోదకాన్ని పుష్పంతో దేవునిపై జల్లవలెను
ఓం ఆపో హి ష్ఠా మయోభువః । తా న ఊర్జే దధాతన । మహే రణాయ చక్షసే ।
యో వః శివతమో రసః । తస్య భాజయతేహ నః । ఉశతీరివ మాతరః ।
తస్మా అరంగ మామ వః । యస్య క్షయాయ జిన్వథ । ఆపో జనయథా చ నః ॥
గంగాది సర్వతీర్థేభ్య ఆహృతైరమలైర్జలైః ।
స్నానం కురుష్వ భగవన్నుమాపుత్ర నమోఽస్తు తే ॥
ఓం శ్రీం హ్రీం … స్వాహా ।
ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి । తన్నో దంతిః ప్రచోదయాత్ ॥
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః । శుద్ధోదకస్నానం సమర్పయామి ॥ స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి ॥
వస్త్రమ్ – వస్త్రయుగ్మం
పత్తితో చేసిన వస్త్రాలను సమర్పించవలెను
అభి వస్త్రా సువసనాన్యర్షాభి ధేనూః సుదుఘాః పూయమానాః ।
అభి చంద్రా భర్తవే నో హిరణ్యాభ్యశ్వాన్ రథినో దేవ సోమ ॥
ఓం శ్రీం హ్రీం … స్వాహా ।
ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి । తన్నో దంతిః ప్రచోదయాత్ ॥
యజ్ఞోపవీతమ్ – జంధ్యం
పత్తితో చేసిన యజ్ఞోపవీతం సమర్పించవలెను
యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్ ।
ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః ॥
ఓం శ్రీం హ్రీం … స్వాహా ।
ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి । తన్నో దంతిః ప్రచోదయాత్ ॥
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః । నూతన యజ్ఞోపవీతం సమర్పయామి ॥
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః । వస్త్రయుగ్మం సమర్పయామి ॥
ఆభరణమ్ – ఆభరణాలు
ఆభరణాలు అలంకరించవలెను (లేనిచో అక్షతలు)
హిరణ్యరూపః స హిరణ్యసందృగపాం నపాత్సేదు హిరణ్యవర్ణః ।
హిరణ్యయాత్పరి యోనేర్నిషద్యా హిరణ్యదా దదత్యన్నమస్మై ॥
ఓం శ్రీం హ్రీం … స్వాహా ।
ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి । తన్నో దంతిః ప్రచోదయాత్ ॥
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః । సర్వాభరణాని సమర్పయామి । ఆభరణార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి ॥
గంధమ్ – చందనం
గంధం అలంకరించవలెను
గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీమ్ ।
ఈశ్వరీగ్ం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియమ్ ॥
ఓం శ్రీం హ్రీం … స్వాహా ।
ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి । తన్నో దంతిః ప్రచోదయాత్ ॥
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః । దివ్యశ్రీ గంధం సమర్పయామి ॥
అక్షతాః – అక్షతలు
గరికపోచలు (దూర్వలు), అక్షతలతో పూజించవలెను
ఆయనే తే పరాయణే దూర్వా రోహంతు పుష్పిణీః ।
హ్రదాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహా ఇమే ॥
ఓం శ్రీం హ్రీం … స్వాహా । ఓం తత్పురుషాయ … ప్రచోదయాత్ ॥
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః । గంధస్యోపరి అలంకరణార్థం దూర్వాక్షతైః పూజయామి ॥
సుముఖాది షోడశనామావళిః – 16 నామాలతో పూజ
ఒక్కో నామానికి పుష్పాక్షతలతో పూజించవలెను
- ఓం సుముఖాయ నమః
- ఓం ఏకదంతాయ నమః
- ఓం కపిలాయ నమః
- ఓం గజకర్ణకాయ నమః
- ఓం లంబోదరాయ నమః
- ఓం వికటాయ నమః
- ఓం విఘ్నరాజాయ నమః
- ఓం గణాధిపాయ నమః
- ఓం ధూమకేతవే నమః
- ఓం గణాధ్యక్షాయ నమః
- ఓం ఫాలచంద్రాయ నమః
- ఓం గజాననాయ నమః
- ఓం వక్రతుండాయ నమః
- ఓం శూర్పకర్ణాయ నమః
- ఓం హేరంబాయ నమః
- ఓం స్కందపూర్వజాయ నమః
ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః , ఓం శ్రీ మహాగణాధిపతయే నమః । నానావిధ పరిమళ పత్రపుష్పాణి పూజయామి ॥
పుష్పాణి – పుష్పాలు
పుష్పములు దేవునిపై వేయవలెను
సుగంధాని సుపుష్పాణి జాజీకుందముఖాని చ ।
ఏకవింశతి పత్రాణి సంగృహాణ నమోఽస్తు తే ॥
ఓం శ్రీం హ్రీం … స్వాహా ।
ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి । తన్నో దంతిః ప్రచోదయాత్ ॥
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః । పుష్పైః పూజయామి ॥
అథాంగపూజా – అంగ పూజ
పుష్పాక్షతలతో ఆయా అంగాలను పూజించవలెను
- ఓం గణేశాయ నమః — పాదౌ పూజయామి
- ఓం విఘ్నరాజాయ నమః — జానునీ పూజయామి
- ఓం అఖువాహనాయ నమః — ఊరూ పూజయామి
- ఓం హేరంబాయ నమః — కటిం పూజయామి
- ఓం కామారిసూనవే నమః — నాభిం పూజయామి
- ఓం లంబోదరాయ నమః — ఉదరం పూజయామి
- ఓం గౌరీసుతాయ నమః — స్తనౌ పూజయామి
- ఓం గణనాయకాయ నమః — హృదయం పూజయామి
- ఓం స్థూలకంఠాయ నమః — కంఠం పూజయామి
- ఓం స్కందాగ్రజాయ నమః — స్కంధౌ పూజయామి
- ఓం పాశహస్తాయ నమః — హస్తాన్ పూజయామి
- ఓం గజవక్త్రాయ నమః — వక్త్రం పూజయామి
- ఓం విఘ్నహంత్రే నమః — లలాటం పూజయామి
- ఓం సర్వేశ్వరాయ నమః — శిరః పూజయామి
- శ్రీ మహాగణాధిపతయే నమః — సర్వాణ్యంగాని పూజయామి
శ్రీ విఘ్నేశ్వర అష్టోత్తర శతనామావళిః – 108 నామాలు
ఒక్కో నామానికి పుష్పాక్షతలతో పూజించవలెను
- ఓం వినాయకాయ నమః
- ఓం విఘ్నరాజాయ నమః
- ఓం గౌరీపుత్రాయ నమః
- ఓం గణేశ్వరాయ నమః
- ఓం స్కందాగ్రజాయ నమః
- ఓం అవ్యయాయ నమః
- ఓం పూతాయ నమః
- ఓం దక్షాయ నమః
- ఓం అధ్యక్షాయ నమః
- ఓం ద్విజప్రియాయ నమః
- ఓం అగ్నిగర్భచ్ఛిదే నమః
- ఓం ఇంద్రశ్రీప్రదాయ నమః
- ఓం వాణీప్రదాయ నమః
- ఓం అవ్యయాయ నమః
- ఓం సర్వసిద్ధిప్రదాయ నమః
- ఓం శర్వతనయాయ నమః
- ఓం శర్వరీప్రియాయ నమః
- ఓం సర్వాత్మకాయ నమః
- ఓం సృష్టికర్త్రే నమః
- ఓం దేవాయ నమః
- ఓం అనేకార్చితాయ నమః
- ఓం శివాయ నమః
- ఓం శుద్ధాయ నమః
- ఓం బుద్ధిప్రియాయ నమః
- ఓం శాంతాయ నమః
- ఓం బ్రహ్మచారిణే నమః
- ఓం గజాననాయ నమః
- ఓం ద్వైమాతురాయ నమః
- ఓం మునిస్తుత్యాయ నమః
- ఓం భక్తవిఘ్నవినాశనాయ నమః
- ఓం ఏకదంతాయ నమః
- ఓం చతుర్బాహవే నమః
- ఓం చతురాయ నమః
- ఓం శక్తిసంయుతాయ నమః
- ఓం లంబోదరాయ నమః
- ఓం శూర్పకర్ణాయ నమః
- ఓం హరయే నమః
- ఓం బ్రహ్మవిదుత్తమాయ నమః
- ఓం కాలాయ నమః
- ఓం గ్రహపతయే నమః
- ఓం కామినే నమః
- ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః
- ఓం పాశాంకుశధరాయ నమః
- ఓం చండాయ నమః
- ఓం గుణాతీతాయ నమః
- ఓం నిరంజనాయ నమః
- ఓం అకల్మషాయ నమః
- ఓం స్వయంసిద్ధాయ నమః
- ఓం సిద్ధార్చితపదాంబుజాయ నమః
- ఓం బీజాపూరఫలాసక్తాయ నమః
- ఓం వరదాయ నమః
- ఓం శాశ్వతాయ నమః
- ఓం కృతినే నమః
- ఓం ద్విజప్రియాయ నమః
- ఓం వీతభయాయ నమః
- ఓం గదినే నమః
- ఓం చక్రిణే నమః
- ఓం ఇక్షుచాపధృతే నమః
- ఓం శ్రీదాయ నమః
- ఓం అజాయ నమః
- ఓం ఉత్పలకరాయ నమః
- ఓం శ్రీపతయే నమః
- ఓం స్తుతిహర్షితాయ నమః
- ఓం కులాద్రిభేత్త్రే నమః
- ఓం జటిలాయ నమః
- ఓం కలికల్మషనాశనాయ నమః
- ఓం చంద్రచూడామణయే నమః
- ఓం కాంతాయ నమః
- ఓం పాపహారిణే నమః
- ఓం సమాహితాయ నమః
- ఓం ఆశ్రితాయ నమః
- ఓం శ్రీకరాయ నమః
- ఓం సౌమ్యాయ నమః
- ఓం భక్తవాంఛితదాయకాయ నమః
- ఓం శాంతాయ నమః
- ఓం కైవల్యసుఖదాయ నమః
- ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః
- ఓం జ్ఞానినే నమః
- ఓం దయాయుతాయ నమః
- ఓం దాంతాయ నమః
- ఓం బ్రహ్మద్వేషవివర్జితాయ నమః
- ఓం ప్రమత్తదైత్యభయదాయ నమః
- ఓం శ్రీకంఠాయ నమః
- ఓం విబుధేశ్వరాయ నమః
- ఓం రమార్చితాయ నమః
- ఓం విధయే నమః
- ఓం నాగరాజయజ్ఞోపవీతవతే నమః
- ఓం స్థూలకంఠాయ నమః
- ఓం స్వయంకర్త్రే నమః
- ఓం సామఘోషప్రియాయ నమః
- ఓం పరస్మై నమః
- ఓం స్థూలతుండాయ నమః
- ఓం అగ్రణ్యే నమః
- ఓం ధీరాయ నమః
- ఓం వాగీశాయ నమః
- ఓం సిద్ధిదాయకాయ నమః
- ఓం దూర్వాబిల్వప్రియాయ నమః
- ఓం అవ్యక్తమూర్తయే నమః
- ఓం అద్భుతమూర్తిమతే నమః
- ఓం శైలేంద్రతనుజోత్సంగఖేలనోత్సుకమానసాయ నమః
- ఓం స్వలావణ్యసుధాసారజితమన్మథవిగ్రహాయ నమః
- ఓం సమస్తజగదాధారాయ నమః
- ఓం మాయినే నమః
- ఓం మూషికవాహనాయ నమః
- ఓం హృష్టాయ నమః
- ఓం తుష్టాయ నమః
- ఓం ప్రసన్నాత్మనే నమః
- ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః
ఓం శ్రీ మహాగణాధిపతి పాదారవిందయోః నానావిధ పరిమళ పత్రపుష్పాణి పూజయామి ॥
ఉత్తరాంగ పూజ
ధూపమ్ – ధూప సమర్పణ
అగరువత్తులు వెలిగించి ధూపము చూపవలెను
వనస్పత్యుద్భవైర్దివ్యైర్నానాగంధైః సుసంయుతః ।
ఆఘ్రేయః సర్వదేవానాం ధూపోఽయం ప్రతిగృహ్యతామ్ ॥
ఓం శ్రీం హ్రీం … స్వాహా ।
ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి । తన్నో దంతిః ప్రచోదయాత్ ॥
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః । ధూపమాఘ్రాపయామి ॥
దీపమ్ – దీపం
దీపము వెలిగించి చూపవలెను
సాజ్యం త్రివర్తిసంయుక్తం వహ్నినా యోజితం మయా ।
గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహమ్ ॥
భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే ।
త్రాహి మాం నరకాద్ఘోరాద్దివ్యజ్యోతిర్నమోఽస్తు తే ॥
ఓం శ్రీం హ్రీం … స్వాహా ।
ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి । తన్నో దంతిః ప్రచోదయాత్ ॥
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః । సాక్షాత్ దీపం దర్శయామి ॥ ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి ॥
నైవేద్యమ్ – నివేదన
పుష్పముతో కలశములోని శుద్ధోదకమును నివేదన పదార్థములపై చల్లవలెను
ఓం భూర్భువస్సువః ।
ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి । ధియో యో నః ప్రచోదయాత్ ॥
సత్యం త్వర్తేన పరిషించామి (పగలు) । ఋతం త్వా సత్యేన పరిషించామి (రాత్రి) ।
అమృతమస్తు । అమృతోపస్తరణమసి స్వాహా ॥
కదళీఫలం నారికేళఖండద్వయం గుడోపహారం నైవేద్యం సమర్పయామి ॥
ఓం ప్రాణాయ స్వాహా । ఓం అపానాయ స్వాహా । ఓం వ్యానాయ స్వాహా ।
ఓం ఉదానాయ స్వాహా । ఓం సమానాయ స్వాహా । ఓం బ్రహ్మణే స్వాహా ॥
మధ్యే మధ్యే అమృతపానీయం సమర్పయామి । అమృతాపిధానమసి । ఉత్తరాపోశనం సమర్పయామి ।
హస్తౌ ప్రక్షాళయామి । పాదౌ ప్రక్షాళయామి । శుద్ధాచమనీయం సమర్పయామి ॥
ఓం శ్రీం హ్రీం … స్వాహా ।
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః । యథాశక్తి నైవేద్యం నివేదయామి ॥
“ప్రాణాయ స్వాహా” మొదలైన ఆరు మంత్రాలతో ఆరుమార్లు చేతితో స్వామికి నివేదన చూపవలెను
తాంబూలమ్ – తాంబూలం
తమలపాకులు, వక్క, దక్షిణ సమర్పించవలెను
పూగీఫలైః సకర్పూరైర్నాగవల్లీదళైర్యుతమ్ ।
ముక్తాచూర్ణసమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్ ॥
ఓం శ్రీం హ్రీం … స్వాహా ।
ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి । తన్నో దంతిః ప్రచోదయాత్ ॥
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః । తాంబూలం సమర్పయామి ॥ ముఖశుద్ధ్యర్థం ఆచమనీయం సమర్పయామి ॥
కర్పూర హారతి
ఘంటానాదము చేయుచూ కర్పూర హారతి చూపవలెను
ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూరశకలైస్తథా ।
నీరాజనం మయా దత్తం గృహాణ వరదో భవ ॥
ఓం శ్రీం హ్రీం … స్వాహా ।
ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి । తన్నో దంతిః ప్రచోదయాత్ ॥
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః । ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి ॥ నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి ॥
మంత్రపుష్పం
పుష్పాక్షతలు, దక్షిణ చేత పట్టుకొని లేచి నిలబడి మంత్రపుష్పం చదివిన పిదప సమర్పించవలెను
ఓం సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః ।
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ॥
ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః ।
వక్రతుండః శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః ॥
షోడశైతాని నామాని యః పఠేచ్ఛృణుయాదపి ।
విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా ।
సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే ॥
ఓం శ్రీం హ్రీం … స్వాహా ।
ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి । తన్నో దంతిః ప్రచోదయాత్ ॥
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః । సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి ॥
ఆత్మప్రదక్షిణమ్ – ప్రదక్షిణ
లేచి నిలబడి తన చుట్టూ మూడుసార్లు కుడి వైపుగా నెమ్మదిగా తిరిగి నమస్కరించవలెను
ప్రదక్షిణం కరోమి త్వాం పార్వతీప్రియపుత్రక ।
నమస్తే విఘ్నరాజేశ నమస్తే విఘ్ననాశన ॥
ఓం శ్రీం హ్రీం … స్వాహా ।
ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి । తన్నో దంతిః ప్రచోదయాత్ ॥
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః । ఆత్మప్రదక్షిణ త్రయ నమస్కారాన్ సమర్పయామి ॥
పిమ్మట సాష్టాంగ దండ ప్రణామం ఆచరించవలెను
సాష్టాంగ నమస్కారమ్ – సాష్టాంగ ప్రణామం
ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా ।
పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోఽష్టాంగ ఉచ్యతే ॥
శ్రీ మహాగణాధిపతయే నమః । సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి ॥
ప్రార్థన నమస్కారమ్ – ప్రార్థన
నమో నమో గణేశాయ నమస్తే శివసూనవే ।
నిర్విఘ్నం కురు దేవేశ నమామి త్వాం గణాధిప ॥
విఘ్నేశ్వర మహాభాగ సర్వలోకనమస్కృత ।
మయారబ్ధమిదం కర్మ నిర్విఘ్నం కురు సర్వదా ॥
శ్రీ మహాగణాధిపతయే నమః । ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి ॥
ప్రసాదమ్ – ప్రసాద స్వీకారం
ఓం సహస్ర పరమా దేవీ శతమూలా శతాంకురా ।
సర్వం హరతు మే పాపం దూర్వా దుఃస్వప్ననాశినీ ॥
శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి ॥
శ్రీ మహాగణపతి ప్రసాదసిద్ధిరస్తు ॥
ఇతి శ్రీ మహాగణపతి పూజా సమాప్తా ॥ హరిః ఓం తత్సత్ ॥
పూజ చేసిన పుష్పాక్షతలు శిరస్సున ధరించవలెను.


