ఇది పూజలోని మొదటి భాగం. తరువాత సంకల్పం, కలశారాధన, ఆపై విఘ్నేశ్వర పూజ వస్తాయి.
దేహశుద్ధిః / ఆత్మశుద్ధిః – శుద్ధి మంత్రం
ఓం అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతోఽపి వా ।
యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరః శుచిః ॥
ఈ పవిత్రత మంత్రం చదువుతూ ఉద్ధరిణితో నీళ్లు తీసుకొని “పుండరీకాక్ష, పుండరీకాక్ష, పుండరీకాక్షాయ నమః” అనుకొని ఆ నీటిని కుడిచేతి బొటనవ్రేలితో శిరస్సుపై మూడుసార్లు చల్లుకోవాలి.
శుభముహూర్త మంత్రమ్
ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి ।
సా నో మంద్రేషమూర్జం దుహానా ధేనుర్వాగస్మానుప సుష్టుతైతు ॥
అయం ముహూర్తః సుముహూర్తోఽస్తు ॥
ఈ మంత్రం ఉచ్చరించిన పిదప దేవునిపై అక్షతలు వేయాలి.
శుభ శకున శ్లోకాలు
ఉమామహేశ్వర ధ్యానమ్
యచ్ఛివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళా ।
తయోః సంస్మరణాత్పుంసాం సర్వతో జయమంగళమ్ ॥
విష్ణు ధ్యానమ్
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ ।
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ॥
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ ।
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేఽంఘ్రియుగం స్మరామి ॥
యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః ।
తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ ॥
స్మృతే సకలకల్యాణభాజనం యత్ర జాయతే ।
పురుషం తమజం నిత్యం వ్రజామి శరణం హరిమ్ ॥
సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషామమంగళమ్ ।
యేషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనం హరిః ॥
లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ।
యేషామిందీవరశ్యామో హృదయస్థో జనార్దనః ॥
శ్రీరామ ధ్యానమ్
ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదామ్ ।
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ ॥
పరమేశ్వరీ ధ్యానమ్
సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే ।
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోఽస్తు తే ॥
శకున మంత్రాలు చదివిన తరువాత పుష్పాలు గణేశుని వద్ద ఉంచాలి.
పుణ్యదంపతి నమస్కారః / మంగళాచరణమ్ – దేవ దంపతులకు నమస్కారం
గణపతిపై అక్షతలు వేస్తూ ఈ నామాలు చెప్పాలి.
- ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః
- ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః
- ఓం వాణీహిరణ్యగర్భాభ్యాం నమః
- ఓం శచీపురందరాభ్యాం నమః
- ఓం ఇంద్రాది అష్టదిక్పాలక దేవతాభ్యో నమః
- ఓం అరుంధతీవసిష్ఠాభ్యాం నమః
- ఓం శ్రీ సీతారామాభ్యాం నమః
- ఓం శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః
- ఓం శ్రీ ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః
- ఓం మాతాపితృభ్యాం నమః
- ఓం సర్వేభ్యో మహాజనేభ్యో నమః
ఆచమనమ్ – తీర్థంతో ఆచమనం
గోకర్ణం లేదా శంఖం వలె కుడిచేతిని ముడిచి, మొదటి మూడు మంత్రాలకు మూడు ఉద్ధరిణెల తీర్థం చేతిలో పోసుకొని ఆచమనం చేయాలి. తరువాత ఉద్ధరిణి ఉదకంతో చేతిని శుద్ధి చేసుకొని మిగిలిన నామాలు చెప్పాలి.
- ఓం కేశవాయ స్వాహా
- ఓం నారాయణాయ స్వాహా
- ఓం మాధవాయ స్వాహా
- ఓం గోవిందాయ నమః
- ఓం విష్ణవే నమః
- ఓం మధుసూదనాయ నమః
- ఓం త్రివిక్రమాయ నమః
- ఓం వామనాయ నమః
- ఓం శ్రీధరాయ నమః
- ఓం హృషీకేశాయ నమః
- ఓం పద్మనాభాయ నమః
- ఓం దామోదరాయ నమః
- ఓం సంకర్షణాయ నమః
- ఓం వాసుదేవాయ నమః
- ఓం ప్రద్యుమ్నాయ నమః
- ఓం అనిరుద్ధాయ నమః
- ఓం పురుషోత్తమాయ నమః
- ఓం అధోక్షజాయ నమః
- ఓం నారసింహాయ నమః
- ఓం అచ్యుతాయ నమః
- ఓం జనార్దనాయ నమః
- ఓం ఉపేంద్రాయ నమః
- ఓం హరయే నమః
- ఓం శ్రీ కృష్ణాయ నమః
ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః ॥
స్థలశుద్ధిః / భూతోచ్చాటనమ్ – స్థల శుద్ధి
ఉద్ధరిణితో నీటిని కుడిచేతిలో పోసుకొని పైకి, ప్రక్కలకు, వెనుకకు చల్లుతూ ఈ మంత్రం చదవాలి.
ఉత్తిష్ఠంతు భూతపిశాచాః యే తే భూమిభారకాః ।
యే తేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ॥
ప్రాణాయామం
ఎవరి కుడిచేతితో వారు తమ ముక్కును పట్టుకొని ఈ మంత్రం చెప్పుకోవాలి.
ఓం భూః । ఓం భువః । ఓగ్ం సువః । ఓం మహః । ఓం జనః । ఓం తపః । ఓగ్ం సత్యమ్ ।
ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి । ధియో యో నః ప్రచోదయాత్ ॥
ఓమాపో జ్యోతీ రసోఽమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్ ॥
పిమ్మట సంకల్పం చెప్పుకోవాలి.


