మంత్రక్రమ సహిత పూజావిధానం – శుద్ధి నుండి ప్రాణాయామం వరకు

0

ఇది పూజలోని మొదటి భాగం. తరువాత సంకల్పం, కలశారాధన, ఆపై విఘ్నేశ్వర పూజ వస్తాయి.

దేహశుద్ధిః / ఆత్మశుద్ధిః – శుద్ధి మంత్రం

ఓం అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతోఽపి వా ।
యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరః శుచిః ॥

ఈ పవిత్రత మంత్రం చదువుతూ ఉద్ధరిణితో నీళ్లు తీసుకొని “పుండరీకాక్ష, పుండరీకాక్ష, పుండరీకాక్షాయ నమః” అనుకొని ఆ నీటిని కుడిచేతి బొటనవ్రేలితో శిరస్సుపై మూడుసార్లు చల్లుకోవాలి.

శుభముహూర్త మంత్రమ్

ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి ।
సా నో మంద్రేషమూర్జం దుహానా ధేనుర్వాగస్మానుప సుష్టుతైతు ॥
అయం ముహూర్తః సుముహూర్తోఽస్తు ॥

ఈ మంత్రం ఉచ్చరించిన పిదప దేవునిపై అక్షతలు వేయాలి.

 శుభ శకున శ్లోకాలు

ఉమామహేశ్వర ధ్యానమ్

యచ్ఛివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళా ।
తయోః సంస్మరణాత్పుంసాం సర్వతో జయమంగళమ్ ॥

విష్ణు ధ్యానమ్

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ ।
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ॥

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ ।
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేఽంఘ్రియుగం స్మరామి ॥

యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః ।
తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ ॥

స్మృతే సకలకల్యాణభాజనం యత్ర జాయతే ।
పురుషం తమజం నిత్యం వ్రజామి శరణం హరిమ్ ॥

సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషామమంగళమ్ ।
యేషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనం హరిః ॥

లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ।
యేషామిందీవరశ్యామో హృదయస్థో జనార్దనః ॥

శ్రీరామ ధ్యానమ్

ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదామ్ ।
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ ॥

పరమేశ్వరీ ధ్యానమ్

సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే ।
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోఽస్తు తే ॥

శకున మంత్రాలు చదివిన తరువాత పుష్పాలు గణేశుని వద్ద ఉంచాలి.

పుణ్యదంపతి నమస్కారః / మంగళాచరణమ్ – దేవ దంపతులకు నమస్కారం

గణపతిపై అక్షతలు వేస్తూ ఈ నామాలు చెప్పాలి.

  • ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః
  • ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః
  • ఓం వాణీహిరణ్యగర్భాభ్యాం నమః
  • ఓం శచీపురందరాభ్యాం నమః
  • ఓం ఇంద్రాది అష్టదిక్పాలక దేవతాభ్యో నమః
  • ఓం అరుంధతీవసిష్ఠాభ్యాం నమః
  • ఓం శ్రీ సీతారామాభ్యాం నమః
  • ఓం శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః
  • ఓం శ్రీ ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః
  • ఓం మాతాపితృభ్యాం నమః
  • ఓం సర్వేభ్యో మహాజనేభ్యో నమః

ఆచమనమ్ – తీర్థంతో ఆచమనం

గోకర్ణం లేదా శంఖం వలె కుడిచేతిని ముడిచి, మొదటి మూడు మంత్రాలకు మూడు ఉద్ధరిణెల తీర్థం చేతిలో పోసుకొని ఆచమనం చేయాలి. తరువాత ఉద్ధరిణి ఉదకంతో చేతిని శుద్ధి చేసుకొని మిగిలిన నామాలు చెప్పాలి.

  1. ఓం కేశవాయ స్వాహా
  2. ఓం నారాయణాయ స్వాహా
  3. ఓం మాధవాయ స్వాహా
  4. ఓం గోవిందాయ నమః
  5. ఓం విష్ణవే నమః
  6. ఓం మధుసూదనాయ నమః
  7. ఓం త్రివిక్రమాయ నమః
  8. ఓం వామనాయ నమః
  9. ఓం శ్రీధరాయ నమః
  10. ఓం హృషీకేశాయ నమః
  11. ఓం పద్మనాభాయ నమః
  12. ఓం దామోదరాయ నమః
  13. ఓం సంకర్షణాయ నమః
  14. ఓం వాసుదేవాయ నమః
  15. ఓం ప్రద్యుమ్నాయ నమః
  16. ఓం అనిరుద్ధాయ నమః
  17. ఓం పురుషోత్తమాయ నమః
  18. ఓం అధోక్షజాయ నమః
  19. ఓం నారసింహాయ నమః
  20. ఓం అచ్యుతాయ నమః
  21. ఓం జనార్దనాయ నమః
  22. ఓం ఉపేంద్రాయ నమః
  23. ఓం హరయే నమః
  24. ఓం శ్రీ కృష్ణాయ నమః

ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః ॥

స్థలశుద్ధిః / భూతోచ్చాటనమ్ – స్థల శుద్ధి

ఉద్ధరిణితో నీటిని కుడిచేతిలో పోసుకొని పైకి, ప్రక్కలకు, వెనుకకు చల్లుతూ ఈ మంత్రం చదవాలి.

ఉత్తిష్ఠంతు భూతపిశాచాః యే తే భూమిభారకాః ।
యే తేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ॥

 ప్రాణాయామం

ఎవరి కుడిచేతితో వారు తమ ముక్కును పట్టుకొని ఈ మంత్రం చెప్పుకోవాలి.

ఓం భూః । ఓం భువః । ఓగ్ం సువః । ఓం మహః । ఓం జనః । ఓం తపః । ఓగ్ం సత్యమ్ ।
ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి । ధియో యో నః ప్రచోదయాత్ ॥
ఓమాపో జ్యోతీ రసోఽమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్ ॥

పిమ్మట సంకల్పం చెప్పుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here