ఉదయం స్నానం నుంచి రాత్రి శయనం వరకు – నియమావళి ఆధారంగా ఒక రోజు ఎలా గడపాలో సరళమైన క్రమం.
ఈ క్రమం దీక్షా నియమావళి ఆధారంగా సూచించినది. ఉద్యోగం, ఆరోగ్యం బట్టి సమయాల్లో మార్పులకు మీ గురుస్వామి గారిని సంప్రదించండి.
| సమయం | చేయవలసినది |
|---|---|
| బ్రహ్మ ముహూర్తం / సూర్యోదయానికి ముందు | నిద్ర లేచి స్వామి నామస్మరణ; చన్నీటి శిరస్నానం; విభూతి, చందనం, కుంకుమ ధారణ. |
| ఉదయ సంధ్య | దీపారాధన, స్వామి పూజ, శరణు ఘోష, వీలైతే దేవాలయ దర్శనం. |
| పగలు | విధులు నిర్వహిస్తూ నిరంతర నామస్మరణ; చెప్పులు లేకుండా; ఎవరిని నొప్పించకుండా. |
| మధ్యాహ్నం | స్వామికి నివేదన చేసిన తరువాత ఒంటిపూట సాత్విక భోజనం (ఏకభుక్తం). |
| సాయం సంధ్య | మళ్లీ చన్నీటి శిరస్నానం; దీపారాధన, పూజ, భజన, శరణు ఘోష, హరివరాసనం. |
| రాత్రి | అల్పాహారం; పవిత్ర గ్రంథ పఠనం; నేలపై వామివైపు శయనం. |
పట్టికలోని లింకులు నేరుగా ఆ పూజ / శ్లోకం మార్గదర్శికి తీసుకెళ్తాయి. ఫోన్లో పూజ చేసేటప్పుడు ఆ మార్గదర్శిని తెరచి పెట్టుకోవచ్చు.


