మాలధారుల దినచర్య

0

ఉదయం స్నానం నుంచి రాత్రి శయనం వరకు – నియమావళి ఆధారంగా ఒక రోజు ఎలా గడపాలో సరళమైన క్రమం.

ఈ క్రమం దీక్షా నియమావళి ఆధారంగా సూచించినది. ఉద్యోగం, ఆరోగ్యం బట్టి సమయాల్లో మార్పులకు మీ గురుస్వామి గారిని సంప్రదించండి.

సమయం చేయవలసినది
బ్రహ్మ ముహూర్తం / సూర్యోదయానికి ముందు నిద్ర లేచి స్వామి నామస్మరణ; చన్నీటి శిరస్నానం; విభూతి, చందనం, కుంకుమ ధారణ.
ఉదయ సంధ్య దీపారాధన, స్వామి పూజ, శరణు ఘోష, వీలైతే దేవాలయ దర్శనం.
పగలు విధులు నిర్వహిస్తూ నిరంతర నామస్మరణ; చెప్పులు లేకుండా; ఎవరిని నొప్పించకుండా.
మధ్యాహ్నం స్వామికి నివేదన చేసిన తరువాత ఒంటిపూట సాత్విక భోజనం (ఏకభుక్తం).
సాయం సంధ్య మళ్లీ చన్నీటి శిరస్నానం; దీపారాధన, పూజ, భజన, శరణు ఘోష, హరివరాసనం.
రాత్రి అల్పాహారం; పవిత్ర గ్రంథ పఠనం; నేలపై వామివైపు శయనం.

పట్టికలోని లింకులు నేరుగా ఆ పూజ / శ్లోకం మార్గదర్శికి తీసుకెళ్తాయి. ఫోన్‌లో పూజ చేసేటప్పుడు ఆ మార్గదర్శిని తెరచి పెట్టుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here