పడిపూజ ప్రారంభించు విధానం, మంత్రక్రమ సహిత పూజా విధానం

2

శ్రీ అయ్యప్పస్వామి పూజా కార్యక్రమంలో పడిపూజ ఒక భాగం. అయ్యప్ప పూజలయందు ముందుగా గురుస్వామి గారు శ్రీ విఘ్నేశ్వరుడు, శ్రీ సుబ్రహ్మణ్యస్వామి, శ్రీ లక్ష్మీదేవి, శ్రీ అయ్యప్పస్వామి వారలకు షోడశోపచారాలతో వేదోక్తంగా పూజాభిషేకాలు జరిపించిన పిదప పడిపూజ ప్రారంభిస్తారు.

పడిపూజ ప్రారంభించుటకు ముందు గురుస్వామి గారు శ్రీ అయ్యప్పస్వామి వారికి సాష్టాంగ దండ ప్రణామం ఆచరించి, శబరిగిరి సన్నిధి ముంగిట 18 మెట్లపై ఆవాహనమై ఉన్న “పదునెనిమిది దేవతామూర్తులను” మదిలో తలచుకొని వారికి శిరస్సు వంచి నమస్కరించి, 18 మెట్లవలె అమర్చబడి ఉన్న పూజాస్థలం వద్ద ఎదురుగా కూర్చుండి – “అయ్యప్పస్వామీ! 18 మెట్లపై ఆవాహనమై ఉన్న దేవతామూర్తులకు పేరుపేరున ధ్యానావాహనాది షోడశోపచారాలతో పూజలు జరిపే భాగ్యం కలిగించు స్వామీ!” అని మనసారా వేడుకుంటూ పడిపూజ ప్రారంభిస్తారు. స్వామి శరణం.

ముఖ్య గమనిక: శ్రీ దివ్య పడిపూజానంతరం క్షమాపణ, ఉద్వాసనం, తీర్థ ప్రసాదాలు – ఈ క్రమంలో శ్రీ అయ్యప్పస్వామి వారి పూజ పరిసమాప్తం గావించాలి.

పడిపూజ మంత్రక్రమం

  1. సామగ్రి సిద్ధం చేసి, పడిని అలంకరించి, ప్రతి మెట్టుపై దీపం, కొబ్బరికాయ ఉంచండి.
  2. పూజా ప్రారంభం, సంకల్పం (“దివ్య పడిపూజాం కరిష్యే”), కలశారాధన.
  3. విఘ్నేశ్వర పూజ, దేవీ పూజ, అయ్యప్పస్వామి పూజ, అభిషేకం.
  4. అష్టాదశ సోపాన దేవతా పూజ — 1వ మెట్టు నుండి 18వ మెట్టు వరకు, ప్రతి మెట్టుకు దీపం, ధ్యానం, ఉపచారాలు, హారతి, పడిపాట.
  5. పడిపూజ మంగళం — సమష్టి హారతి, ఉత్తరాంగ పూజ, హరివరాసనం, ప్రసాదం.

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప ॥

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here